టీఆర్ఎస్ ఇక నుండి బీఆర్ఎస్: విస్తృత స్థాయి సమావేశం తీర్మాణం

టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ పేరును మారుస్తూ  తీర్మానం చేశారు. టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ మారుస్తూ తీర్మానం ఏకగీవ్రంగా ఆమోదించారు. 
 

KCR National Party:TRS  Resolutes Its Name As BRS

హైదరాబాద్: టీఆర్ఎస్  విస్తృత స్థాయి సమావేశంలో కేసీఆర్  జాతీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్టుగా  ప్రకటించారు. టీఆర్ఎస్ ఇక నుండి బీఆర్ఎస్ గా మారనుంది.పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో సీఎం కేసీఆర్ ఈ విషయాన్ని ప్రకటించారు. 

KCR National Party:TRS  Resolutes Its Name As BRS

ఇవాళ మధ్యాహ్నం 1:19  గంటలకు తీర్మానం ప్రతిపై సీఎం కేసీఆర్  సంతకం చేశారు. ఇవాళ నిర్వహించిన టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో 283 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మారుస్తూ చేసిన తీర్మానాన్ని ఆమోదించారు. 

ఈ తీర్మానం ప్రతిని సమావేశంలో  కేసీఆర్ చదివి విన్పించారు. అనంతరం కేసీఆర్ ఈ తీర్మానం ప్రతిపై సంతకం చేశారు.  టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ పేరుగా మారుస్తూ తీసుకున్నట్టుగా కేసీఆర్ ప్రకటించగానే ప్రతినిధులు చప్పట్లు కొడుతూ తమ హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.  ఈ తీర్మానం చదివే సమయంలో  కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి  కూడ సమావేశంలోనే ఉన్నారు.  

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం టీఆర్ఎస్ 2001 ఏప్రిల్ 27వ తేదీన ఆవిర్భవించింది. తెలంగాణ రాష్ట్రం కోసం అనేక ఉద్యమాలు సాగాయి. కేంద్రంలోని యూపీఏ సర్కార్ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది.2014 జూన్ రెండో తేదీన ఉమ్మడి ఏపీ రాష్ట్రాన్ని తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలుగా విభజించారు. 2014 లో జరిగిన ఎన్నికల్లో తెలంగాణలో టీఆర్ఎస్ అధికారాన్ని కైవసం చేసుకుంది. 2018లో రెండో సారి కేసీఆర్ తెలంగాణలో అధికారాన్ని కైవసం చేసుకున్నారు. కొంతకాలంగా జాతీయ రాజకీయాల్లో ప్రవేశించాలని కేసీఆర్ భావిస్తున్నారు.  2024 ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి రాకుండా నిలువరిచేందుకు జాతీయ  పార్టీని ఏర్పాటు చేయాలని ఆయన తలపెట్టారు. 

జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించనున్న నేపథ్యంలో  టీఆర్ఎస్ పేరును మార్చాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేసి టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. జాతీయపార్టీ ఏర్పాటుకు దారి తీసిన పరిస్థితులను కేసీఆర్ వివరించారు. ఈ సందర్భంగా  సమావేశం టీఆర్ఎస్ పేరు మారుస్తూ ఏకవాక్య తీర్మాన్ని మాజీ స్పీకర్  మధుసూధనాచారి ప్రవేశ పెట్టారు.  ఈ తీర్మానాన్ని సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది.,  

Also read:ప్రారంభమైన టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం: జాతీయ పార్టీ ఏర్పాటుపై కీలక తీర్మానం

 2024 ఎన్నికల్లో బీఆర్ఎస్  పలు రాష్ట్రాల్లో తమ అభ్యర్ధులను బరిలోకి దింపనుంది.  ఏయే రాష్ట్రాల్లోని ఏయే స్థానాల్లో పోటీ చేయాలనే  విషయమై కేసీఆర్  ఇప్పటికే పార్టీ నేతలతో చర్చించారు.  తమ  పార్టీతో మిత్రపక్షంగా ఉన్న పార్టీలతో కలిసి పొత్తులతో పలు రాష్ట్రాల్లో కేసీఆర్ కు చెందిన బీఆర్ఎస్ పోటీ చేసే అవకాశం ఉంది. టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం తీర్మానం కాపీనీ కేంద్ర ఎన్నికల సంఘానికి టీఆర్ఎస్ పంనుంది. రేపు ఉదయం టీఆర్ఎస్ ప్రతినిధి బృందం  ఈసీ అధికారులకు ఈ తీర్మానం ప్రతిని అందించనున్నారు. 

తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం ముగిసిన తర్వాత  ప్రగతి భవన్ కు  కేసీఆర్ తో పాటు ప్రతినిధులు చేరకున్నారు. .  ప్రగతి భవన్ లో కుమారస్వామి, తిరుమలవలన్ తో పాటు కలిసి  కేసీఆర్  లంచ్ చేశారు. సాయంత్రం కేసీఆర్ మీడియాాతో జాతీయ పార్టీ గురించి వివరించనున్నారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios