ఆర్మీజవాన్ కూతురిపై అత్యాచారం చేసింది మరో ఆర్మీ జవానే....

Army sepoy attempted rape in hyderabad
Highlights

హైదరాబాద్ దారుణ ఘటన చోటుచేసుకుంది.  అందరికీ ఆదర్శవంతంగా ఉండాల్సిన ఓ ఆర్మీ జవాన్ నీచమైన పనికి పాల్పడ్డాడు. ఓ ప్రియుడితో కలిసి వున్న ఓ యువతిని బెదిరించి అత్యాచారయత్నం చేశాడు. 

హైదరాబాద్ దారుణ ఘటన చోటుచేసుకుంది.  అందరికీ ఆదర్శవంతంగా ఉండాల్సిన ఓ ఆర్మీ జవాన్ నీచమైన పనికి పాల్పడ్డాడు. ఓ ప్రియుడితో కలిసి వున్న ఓ యువతిని బెదిరించి అత్యాచారయత్నం చేశాడు. 

ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని బొల్లారం లో ఓ బీహర్ బ్రిజేశ్ కుమార్ అనే వ్యక్తి ఆర్మీ జవాన్ గా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే ఇతడు నిన్న అర్థరాత్రి సమయంలో స్థానిక రైల్వేస్టేషన్ వద్ద ఓ ప్రేమ జంటను గమనించాడు. వారిని బెదిరించి యువకిడిపై దారుణంగా దాడి చేశాడు. అనంతరం యువతిపై అత్యాచార యత్నం చేశాడు. దీంతో యువకుడు 100 నంబర్ కు ఫోన్ చేయడంతో ఆ ప్రాంతంలో  పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ఆర్మీజవాన్ నుండి యువతిని కాపాడారు.

అయితే ఈ నిందితుడి నుండి డీఎన్ఏ నమూనాలను సేకరించిన పోలీసులు టెస్టుల నిమిత్తం పంపించారు. అయితే ఇందులో భయంకరమైన నిజాలు బైటపడ్డాయి. గతంలో ఓ ఆర్మీ వాన్ కూతిరిపై అత్యంత దారుణంగా అత్యాచారానికి పాల్పడింది కూడా ఈ నిందితుడేనని నిర్ధారణ అయినట్లు పోలీసులు తెలిపారు. దీంతో నిందితుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. 
 

loader