సిద్దిపేట  జిల్లా  కేంద్రంలో ఇవాళ గన్ మిస్ ఫైర్ అయింది.  తుపాకీని  శుభ్రం  చేస్తున్న సమయంలో  తుపాకీ  పేలింది.  ఈ ఘటనలో  ఏఆర్ కానిస్టేబుల్  రాజశేఖర్ తీవ్రంగా గాయపడ్డారు.


సిద్దిపేట: సిద్దిపేట జిల్లాలో మంగళవారంనాడు గన్ మిస్ ఫైర్ అయింది. ఈ ఘటనలో ఏఆర్ కానిస్టేబుల్ రాజశేఖర్ కుడి కన్నుకు గాయమైంది. తుపాకులు శుభ్రం చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు తుపాకీ పేలింది. దీంతో రాజశేఖర్ కుడి కంటికి బుల్లెట్ గాయమైంది. వెంటనే ఇతర పోలీస్ సిబ్బంది రాజశేఖర్ ను ఆసుపత్రికి తరలించారు. రాజశేఖర్ కు వైద్యులు చికిత్స అందించారు. ప్రస్తుతం రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు.