హైదరాబాద్:ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలకు త్వరలోనే చెక్ పడే అవకాశం ఉంది. అపెక్స్ సమావేశం నిర్వహణకు ఎజెండా ఖరారు చేయాలని కేంద్ర జలవనరుల శాఖ కృష్ణా, గోదావరి బోర్డులను గురువారం నాడు ఆదేశించింది.

పోతిరెడ్డిపాడు ప్రవాహం సామర్ధ్యం పెంచేందుకు గాను రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కు ఈ నెల 5వ తేదీన ఏపీ ప్రభుత్వం 203 జీవోను జారీ చేసింది. ఈ జీవోపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేసింది.

also read:పోతిరెడ్డిపాడు ఎఫెక్ట్: జూరాల‌కు ఎగువన రిజర్వాయర్‌కు తెలంగాణ సర్కార్ ప్లాన్

గోదావరి, కృష్ణా నదులపై తెలంగాణ రాష్ట్రం నిర్మిస్తున్న ప్రాజెక్టులపై ఏపీ ప్రభుత్వం కృష్ణా, గోదావరి బోర్డులకు కూడ ఫిర్యాదు చేసింది. పోతిరెడ్డిపాడు విషయమై ఏపీని కృష్ణా బోర్డు వివరణ కోరింది. గోదావరిపై ఏపీ ఫిర్యాదు మేరకు తెలంగాణను కూడ గోదావరి బోర్డు బుధవారం నాడు ఫిర్యాదు చేసింది.

రెండు రాష్ట్రాల జలవివాదాలపై చర్చించేందుకు అపెక్స్ కౌన్సిల్ సమావేశం చర్చించనుంది. ఉమా భారతి కేంద్ర జల వనరుల శాఖ మంత్రిగా ఉన్న సమయంలో 2016 సెప్టెంబర్ 21న అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరిగింది. 

also read:జగన్‌ సర్కార్‌కు ఎన్జీటీ షాక్: పోతిరెడ్డిపాడు రాయలసీమ లిఫ్ట్ పై స్టే

ఈ సమావేశంలో అప్పటి ఏపీ సీఎం చంద్రబాబు, ఏపీ మంత్రి దేవినేని ఉమ, తెలంగాణ సీఎం కేసీఆర్, అప్పటి నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావులతో అధికారులు పాల్గొన్నారు.ఈ సమావేశంలో ఆరు అంశాలపై రెండు రాష్ట్రాల మధ్య పరస్పర అంగీకారం కుదిరింది.

ఆ సమావేశంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై ఆ సమావేశంలో రెండు రాష్ట్రాల మధ్య వాదన జరిగింది. చివరకు తెలంగాణ చూపిన ఆధారాలతో ఏపీ ప్రభుత్వం తగ్గిందని సమాచారం. పాలమూరు రంగారెడ్డి పాత ప్రాజెక్టు అంటూ తెలంగాణ ప్రభుత్వం ఈ సమావేశంలో ఆధారాలను చూపింది.

ఇక త్వరలో జరిగే సమావేశంలో కూడ రెండు రాష్ట్రాలు కూడ తమ తమ వాదనలను సమర్ధవంతంగా వినిపించే ప్రయత్నం చేయనున్నాయి.