Asianet News TeluguAsianet News Telugu

రెండో భార్య కూతురుపై ఏపీ కానిస్టేబుల్ లైంగిక వేధింపులు.. బంజారాహిల్స్ స్టేష‌న్ లో కేసు న‌మోదు

రెండో భార్య కూతురుపై ఓ ఏపీకి చెందిన కానిస్టేబుల్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో ఆ బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. 

AP constable sexually abused daughter of second wife.. Case registered in Banjarahills station
Author
First Published Sep 15, 2022, 12:58 PM IST

మహిళలపై అఘాయిత్యాలు ఆగ‌డం లేదు. నిత్యం ఎదో ఒక చోట లైంగి వేధింపుల ఘ‌ట‌న‌లు వెలుగులోకి వ‌స్తూనే ఉన్నాయి. ఆడ‌పిల్ల‌లు క‌నిపిస్తే చాలా మగాళ్ల‌లో ఉన్న మృగాలు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. వావి వర‌స‌లు మ‌రిచి కామంతో కాటేస్తున్నారు. చిన్న పిల్ల‌లు అని కూడా చూడకుండా అత్యాచారాల‌కు పాల్ప‌డుతున్నారు. తాజాగా వ‌రుస‌కు కూతురు అయ్యే బాలిక‌పై ఓ కానిస్టేబుల్ లైంగిక వేధింపుల‌కు గురి చేశాడు. ఈ ఘ‌ట‌న హైద‌రాబాద్ లో చోటు చేసుకుంది. 

పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. బాధితురాలి (17) త‌ల్లిదండ్రులు కొన్నేళ్ల కింద‌ట విడిపోయారు అప్ప‌టి నుంచి ఆమె త‌ల్లి యూస‌ఫ్ గూడ‌లోని సోద‌రుడి ఇంట్లోనే ఉంటోంది. ఈ క్ర‌మంలో ఏడాది కింద‌ట ఏపీలోని విజయవాడలో హెడ్ కానిస్టేబుల్ (41) గా ప‌ని చేస్తున్న వ్య‌క్తిని తన త‌ల్లి పెళ్లి చేసుకుంది. అప్ప‌టి నుంచి ఆ కానిస్టేబుల్ వ‌రుస‌కు కూతురు అయ్యే బాలిక‌పై లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డ‌టం ప్రారంభించాడు.

కూలీ డబ్బులు ఇవ్వ‌లేద‌ని కోటి రూపాయిల మెర్సిడెస్ బెంజ్‌ను కాల్చిన కార్మికుడు..ఎక్క‌డంటే ?

ఈ ఏడాది జులైలో నిందితుడు బాలిక‌ ఒంటరిగా ఉన్న సమయంలో ఇంటికి వ‌చ్చాడు. ఆమె ప్రైవేట్ భాగాల‌ను అస‌భ్యంగా తాకాడు. కామంతో పిచ్చి పిచ్చిగా ప్ర‌వ‌ర్తించాడు. దీనికి ఆమె ప్రతిఘటించడంతో అతడు బెల్టుతో కొట్టాడు. దీంతో విసిగిపోయిన బాధితురాలు బంజారాహిల్స్ పోలీసుల‌ను ఆశ్ర‌యించింది. త‌న‌పై జ‌రిగిన లైంగిక వేధింపుల‌ను వివ‌రిస్తూ పోలీసుల‌కు మంగ‌ళ‌వారం ఫిర్యాదు చేసింది. నిందితుడిపై కేసు న‌మోదు చేసుకున్నారు. అయితే అత‌డిని ఇంకా అరెస్టు చేయాల్సి ఉంది. 

ఇదిలా ఉండ‌గా.. చైన్నైలో కూడా ఇటీవల ఇలాంటి ఘ‌ట‌నే ఒక‌టి వెలుగులోకి వ‌చ్చింది. చెన్నై సమీపంలోని  పోలీస్ క్వార్టర్స్ లో నివాసం ఉంటున్న పాండ్యరాజన్ (50) చెన్నై కార్పొరేషన్ పోలీస్ కమిషనర్ కార్యాలయం లో బాంబు పేలుడు విభాగంలో సబ్ ఇన్స్పెక్టర్ గా పని చేస్తున్నాడు. అత‌డికి విల్లివాక్కం కు చెందిన ఒక మహిళ తో గత పదేళ్లుగా వివాహేతర సంబంధం ఉంది.  ఆ మహిళకు ఒక కుమార్తె కూడా ఉంది.

ల‌ఖింపూర్ ఖేరీ: ద‌ళిత అక్కాచెల్లెళ్లపై అత్యాచారం, హ‌త్య కేసులో ఆరుగురి అరెస్టు

ప్రియురాలిని కలవడానికి వెళ్లిన సమయంలో ఇంట్లో ఉన్న ఆమె కుమార్తె (13)పై  సబ్ ఇన్స్పెక్టర్ కనపడింది. దీంతో పాండ్యరాజన్ తన ప్రియురాలు ఇంట్లో లేని సమయంలో 13 ఏళ్ల బాలికను బెదిరించి, లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. సుమారు ఏడేళ్లుగా బాలికపై ఈ లైంగిక వేధింపులు జరిగినట్లు తెలిసింది. ప్రస్తుతం ఆ బాలికకు 20 ఏళ్లు. ఇటీవలే మరొకరితో వివాహమైంది. ఈ క్రమంలో పుట్టింటికి వచ్చిన సమయంలో యువతిపై తిరిగి సబ్ ఇన్స్పెక్టర్ పాండ్యరాజన్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అతని వేధింపులు భరించలేక, తన కుమార్తెతో కలిసి చెన్నై విల్లివాక్కం మహిళా పోలీస్ స్టేషన్లో ఆ మహిళ ఫిర్యాదు చేసింది. 

త‌ప్పుడు ప్ర‌చారాల‌తో శాంతిభ‌ద్ర‌త‌లు మెరుగుప‌డ‌వు.. యూపీ మైన‌ర్ సిస్ట‌ర్స్ ఘ‌ట‌న‌పై ప్రియాంక గాంధీ..

ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. విచారణలో బాలికకు 13 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుంచి లైంగికంగా వేధింపులకు ఎదురయ్యాయని, ప్రస్తుతం ఆమెకు మరొకరితో వివాహమైనప్పటికీ లైంగిక వేధింపులు ఆపలేదని, దీంతో నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios