కాళేశ్వరం ప్రాజెక్ట్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేడిగడ్డ వద్దకు చేరుకున్నారు.

గన్నవరం నుంచి హెలికాఫ్టర్‌లో మేడిగడ్డకు చేరుకున్న జగన్‌కు తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు ఘనస్వాగతం పలికారు. జగన్ వెంట ఏపీ మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, పెద్దిరెడ్డి వున్నారు. ఈ సందర్భంగా యాగశాలకు వచ్చిన జగన్‌ని శాలువా కప్పి కేసీఆర్ సాదరంగా ఆహ్వానించారు. 

మరికొద్దిసేపట్లో కేసీఆర్‌తో కలిసి జగన్ కాళేశ్వరం ప్రాజెక్ట్‌ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు.