సీనియర్ ఐఎఎస్ అధికారి శ్రీలక్ష్మికి ఊరట:ఓఎంసీ కేసులో అభియోగాల కొట్టివేత

ఓఎంసీ కేసులో  సీనియర్ ఐఎఎస్ అధికారి శ్రీలక్ష్మికి ఊరట లభించింది. 

AP cadre IAS officer Srilakshmi Gets Relief In  OMC case

హైదరాబాద్:సీనియర్ ఐఎఎస్ అధికారి శ్రీలక్ష్మికి  ఊరట లభించింది. ఓఎంసీ కేసులో శ్రీలక్ష్మికి హైకోర్టు  విముక్తి కల్పించింది.ఓఎంసీ కేసులో  శ్రీలక్ష్మిపై ఉన్నఅభియోగాలను హైకోర్టు కొట్టివేసింది.2004-2009 మధ్య కాలంలో మైనింగ్ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీగా శ్రీలక్ష్మి పనిచేశారు..ఈ విషయమై  శ్రీలక్ష్మిపై సీబీఐ కేసు నమోదు చేయడంతో ఏడాదిపాటు శ్రీలక్ష్మి జైలులోనే  ఉన్నారు.

ఓఎంసీకి అనుకూలంగా శ్రీలక్ష్మి  వ్యవహరించారని ఆమెపై సీబీఐ అభియోగాలు మోపింది.సీబీఐ అభియోగాలను శ్రీలక్ష్మి ఖండించింది. ఈ విషయమై కింది కోర్టు నుండి పై కోర్టు వరకు శ్రీ3లక్ష్మి తన వాదనలను విన్పించింది.ఇండస్ట్రీయల్ సెక్రటరీగా తన పరిధి దాటకుండా వ్యవహరించారని శ్రీలక్ష్మి తరపు న్యాయవాదులు హైకోర్టులో తమ వాదనలను విన్పించారు. మైనింగ్  ప్రిన్సిపల్ సెక్రటరీగా  ఉన్నబాధ్యతల నేపథ్యంలో ఓెఎంసీ వ్యవహరాలను చూశారని న్యాయవాదులు వాదించారు.శ్రీలక్ష్మి మైనింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న సమయంలో చాలా మంది ధరఖాస్తులు చేసుకున్నా కూడ గాలి జనార్ధన్ రెడ్డికి మేలు కల్గించేలా వ్యవహరించారని  సీబీఐ వాదించింది.ఆరు మాసాలుగా ఉన్న లీజును మూడేళ్లకు పొడిగించారని  సీబీఐ హైకోర్టులో తన వాదనలను విన్పించింది.చార్జీషీట్ లో ఈ అంశాలను సీబీఐ  ప్రస్తావించింది. 

alsoread:ఓఎంసీ కేసులో అభియోగాల నమోదు.. 9న ఇద్దరు సాక్షుల హాజరుకు సమన్లు...

ఓఎంసీ కేసులో సీబీఐ  సీనియర్ ఐఎఎస్ అధికారి శ్రీలక్ష్మిపై నమోదైన అభియోగాలను తెలంగాణ హైకోర్టు మంగళవారంనాడు కొట్టివేసింది.ఓఎంసీకి మైనింగ్ లీజు కేటాయించే సమయానికి మైనింగ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా శ్రీలక్ష్మి లేరని ఆమె తరపు న్యాయవాది గుర్తు చేస్తున్నారు.ఓఎంసీ కేసులో సీబీఐ వాదరనను శ్రీలక్ష్మి తరపు న్యాయవాది వాదించారు. 

తనపైనమోదైన అభియోగాను కొట్టివేయాలని సీబీఐ కోర్టులో శ్రీలక్ష్మి పిటిషన్ దాఖలు చేసింది. శ్రీలక్ష్మిదాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్ ను గత నెల 17న సీబీఐ కోర్టు కొట్టివేసింది.సీబీఐ  కోర్టు ఉత్తర్వులను తెలంగాణ హైకోర్టులో శ్రీలక్ష్మి సవాల్ చేసింది.శ్రీలక్ష్మిసై   ఐపీసీ 120బీ, రెడ్ విత్ 409 సెక్షన్ల కింద సీబీఐ కేసులు నమోదు చేసింది.అవినీతి నిరోధకచట్టం సెక్షన్ 13(2)రెడ్ విత్ 13(1) డి ప్రకారం అభియోగాలు మోపారు. ఈ అభియోగాల నమోదుకు ఆధారాలు లేవని తెలంగాణ హైకోొర్టు ఇవాళ తీర్పును వెల్లడించింది.ఇంకా ఏమైనా చట్ట నిబంధనలు వర్తిస్తాయోమో పరిశీలించాలని తెలంగాణ హైకోర్టు కోరింది.ఇతర సెక్షన్ల వర్తిస్తే అభియోగాలు నమోదు చేసి విచారించవచ్చని తెలంగాణ హైకోర్టు తెలిపింది.

ఓఎంసీ కేసును త్వరితగతిన విచారణ జరపాలని సుప్రీంకోర్టు తెలంగాణ హైకోర్టును ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించిన పిటిషన్లపై హైకోర్టు విచారణను మరింత వేగవంతం  చేసింది.గాలి జనార్ధన్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై విచారణ సమయంలో సుప్రీంకోర్టు ఈ సూచన చేసింది.దీంతో ఈ కేసుకు సంబంధించిన పిటిషన్ల విచారణపై న్యాయస్థానం దృష్టి కేంద్రీకరించింది.  
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios