మున్సిపల్ ఎన్నికల్లో భాజపాకు ప్రజలనుండి, ఇతరసెటిలర్స్ నుండి అపూర్వ స్పందన వస్తుందని ఏపీ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. కూకట్ పల్లిలో జరిగిన బల్దియా ఎన్నికల్లో ప్రచార సభలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రాలు వేరైనా తెలుగు ప్రజలు ఒక్కటేనని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, ఇక్కడ స్థిర నివాసం ఉన్నవారు అందరూ కలిసి భాజపా కు ఓటేయ్యాలని పిలుపునిచ్చారు. 

కూకట్ పల్లి ప్రజలు భాజాపా అభివృద్ధి కాంక్షిస్తున్నారని హైదరాబాద్ అభివృద్ధి భాజాపా తోనే సాధ్యమని అన్నారు. అప్పట్లో వాజపేయి గారు,ఇప్పుడు మోడీ గారు విరిరువురు అభివృద్ధి కాంక్షించే గొప్ప నాయకులని చెప్పుకొచ్చారు. 

భాజాపా కుటుంబ వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకం అని, కుటుంబ రాజకీయాలను ఎండగట్టాలని కోరారు. గ్రేటర్ ఎన్నికల్లో భాజాపా ఆభ్యర్ధులకు సకరించి కమలం గుర్తుకు ఓటేయ్యాలని కోరారు.