అధిష్టానం పిలుపు: న్యూఢిల్లీ ఎయిర్ పోర్టు నుండి వెనక్కి, ఠాక్రేతో అనుముల రేవంత్ రెడ్డి భేటీ

కాంగ్రెస్ పార్టీ  అగ్రనేతలతో  అనుముల రేవంత్ రెడ్డి  సమావేశాలు ముగిశాయి. ఈ సమావేశాలు ముగిసిన తర్వాత రేవంత్ రెడ్డి  న్యూఢిల్లీ నుండి హైద్రాబాద్ కు తిరిగి బయలుదేరారు. 

anumula revanth reddy leaves from Hyderabad lns

హైదరాబాద్:కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు , తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి న్యూఢిల్లీ నుండి హైద్రాబాద్ కు తిరిగి బయలుదేరేందుకు  న్యూఢిల్లీ ఎయిర్ పోర్టు సమీపానికి  బుధవారం నాడు సాయంత్రం చేరుకున్నారు. అయితే  అదే సమయంలో  కాంగ్రెస్ అధిష్టానం నుండి రేవంత్ రెడ్డికి  పిలుపు వచ్చింది. ఈ పిలుపుతో  రేవంత్ రెడ్డి  న్యూఢిల్లీ ఎయిర్ పోర్టు నుండి తిరిగి కాంగ్రెస్ అగ్రనేతలతో సమావేశం కోసం తిరిగి వెళ్లారు. ఇవాళ సాయంత్రం నాలుగున్నర గంటలకు  ప్రత్యేక విమానంలో రేవంత్ రెడ్డి హైద్రాబాద్ కు బయలు దేరాల్సి ఉంది. ఇందు కోసం  రేవంత్ రెడ్డి  గంట ముందుగానే  ఎయిర్ పోర్టుకు బయలుదేరారు. రేవంత్ రెడ్డి  ఎయిర్ పోర్టుకు  సమీపంలోకి వెళ్లిన సమయంలో  కాంగ్రెస్ నాయకత్వం నుండి రేవంత్ రెడ్డికి మరోసారి పిలుపు వచ్చింది. దీంతో రేవంత్ రెడ్డి  తిరిగి వెనక్కి వెళ్లారు. 

 ఈ నెల  5వ తేదీ రాత్రి అనుముల రేవంత్ రెడ్డి న్యూఢిల్లీకి వెళ్లారు. కాంగ్రెస్ అధిష్టానం పిలుపు మేరకు రేవంత్ రెడ్డి హైద్రాబాద్ నుండి ఢిల్లీకి వెళ్లారు.ఇవాళ ఉదయం కాంగ్రెస్ అగ్రనేతలతో వరుసగా భేటీ అయ్యారు.  

తెలంగాణలో  మంత్రివర్గ కూర్పుతో పాటు , ఆరు గ్యారంటీల అమలు విషయమై  రేవంత్ రెడ్డి  కాంగ్రెస్ అగ్రనేతలతో  చర్చించారు.  నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి,  మల్లు భట్టి విక్రమార్క డిమాండ్లను  కూడ కే.సీ. వేణుగోపాల్ రేవంత్ రెడ్డికి వివరించారు. 

కాంగ్రెస్ పార్టీ  అధినేత మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను కూడ రేవంత్ రెడ్డి  కలిశారు.  కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు హామీలను అమలు చేస్తామని  రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. మంత్రిపదవులు ఆశిస్తున్న నేతలు ఢిల్లీకి క్యూ కట్టారు. పార్టీ అగ్రనేతలతో తమకు పదవులు ఇవ్వాలని కోరుతున్నారు.  ఉత్తమ్ కుమార్ రెడ్డి,  మల్లు భట్టి విక్రమార్క,  శ్రీధర్ బాబు తదితరులు ఇంకా ఢిల్లీలోనే ఉన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో  మంత్రివర్గ కూర్పు విషయమై రేవంత్ రెడ్డితో చర్చించేందుకు  కాంగ్రెస్ నాయకత్వం ఆయనను వెనక్కి పిలిచింది. మహారాష్ట్ర సదన్ భవన్ లో  రేవంత్ రెడ్డి   కాంగ్రెస్ పార్టీ  రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ  మాణిక్ రావు ఠాక్రేతో భేటీ అయ్యారు.

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios