కేసీఆర్ తో లంచ్ చేసిన సివిల్స్ టాపర్ అనుదీప్

Anudeep meets KCR and had lunch with him
Highlights

సివిల్ సర్వీసెస్ లో ఆలిండియా టాప్ ర్యాంక్ సాధించిన దురిశెట్టి అనుదీప్ ను తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అభినందించారు.

హైదరాబాద్: సివిల్ సర్వీసెస్ లో ఆలిండియా టాప్ ర్యాంక్ సాధించిన దురిశెట్టి అనుదీప్ ను తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అభినందించారు. సోమవారం ఆయనకు విందు ఇచ్చారు. కేసిఆర్ తో కలిసి అనుదీప్ మధ్యాహ్న భోజనం చేశారు.

అనుదీప్ తో పాటు ఆయన తల్లిదండ్రులు కూడా ఈ విందుకు వచ్చారు. లక్ష్యసాధన కోసం చిత్తశుద్ధితో కృషి చేస్తే తప్పక విజయం సాధిస్తారని చెప్పడానికి అనుదీప్ నిదర్శనమని కేసిఆర్ అన్నారు.

జాతీయస్థాయిలో టాపర్ గా తెలంగాణ బిడ్డ నిలబడడం మన రాష్ట్రానికే గర్వకారణమని ఆయన అన్నారు.  గత నెల 27వ తేదీన విడుదలైన సివిల్స్ మార్కులను యుపిఎస్సీ ఆదివారంనాడు విడుదల చేసింది. సివిల్స్ లో మొదటి ర్యాంక్ సాధించిన అనుదీప్ కు 55.60 శాతం మార్కులు వచ్చాయి. 

మొత్తం 2,025 మార్కులకు గాను అనుదీప్ 1,126 మార్కులు సాధించారు. రాతపరీక్షలో 950 మార్కులు, ఇంటర్వ్యూలో 176 మార్కులు పొందారు. రెండో ర్యాంకర్ అను కుమారి 55.50 శాతం మార్కులు సాధించారు. 

loader