Asianet News TeluguAsianet News Telugu

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో 26 మంది చిన్నారులను రక్షించిన యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ బృందం..

కూలీ పనుల కోసం వివిధ రాష్ట్రాలనుంచి తరలిస్తున్న 26మంది చిన్నారులను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ బృందం కాపాడింది. 

Anti-human trafficking team rescued 26 children at Secunderabad railway station - bsb
Author
First Published May 26, 2023, 3:59 PM IST

హైదరాబాద్ : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో మహిళా భద్రతా విభాగం యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ విభాగం బుధవారం 26 మంది పిల్లలను రక్షించింది. వారిని తరలిస్తున్న ఎనిమిది మంది అక్రమ రవాణాదారులను అరెస్టు చేసింది. కూలి పనుల కోసం పిల్లలను హైదరాబాద్ తీసుకొచ్చారు.

పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ నుండి ఈస్ట్ కోస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో 13 - 18 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలను తీసుకువస్తున్నట్లు సమాచారం అందడంతో, ప్రభుత్వ రైల్వే పోలీసు, రైల్వే పోలీసు ఫోర్సెమ్ సికింద్రాబాద్,  బచ్పన్ బచావో ఆందోళన్ ఎన్జీవో బృందాలు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి. విజయవాడ నుంచి సికింద్రాబాద్‌ వెళ్లే మార్గంలో వారిని రక్షించేందుకు గాలింపు చర్యలు చేపట్టారు.

వ్యాపారవేత్తల బ్లాక్ మెయిల్: హైద్రాబాద్ లో ముగ్గురి అరెస్ట్

అరెస్టు చేసిన నిందితులను పశ్చిమ బెంగాల్‌కు చెందిన రంజన్ మొల్లా, 19, ప్రియారుల్ సేఖ్, 20, ఎస్‌కె జాకీర్ అలీ, 24, సురోజిత్ సంత్రా, 32లుగా గుర్తించారు. వీరితో పాటు చార్మినార్‌కు చెందిన సెఖ్ సైదుల్ (27), సుసేన్ టుడు (37), అబ్దుల్ అలమిన్ మోండెల్ (30), జార్ఖండ్‌కు చెందిన పింటు దాస్ (30) ఉన్నారు.

జీఆర్పీ పోలీసులు ఈ ముఠాపై భారతీయ శిక్షాస్మృతి సెక్షన్ల కింద చట్టవిరుద్ధమైన నిర్బంధ కార్మిక ప్రయత్నం కింద కేసు నమోదు చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios