హైద్రాబాద్ సాహెబ్ నగర్ లో వారం రోజుల క్రితం డ్రైనేజీలో పనికి వెళ్లిన మరణించిన అంతయ్య డెడ్‌బాడీ సోమవారం నాడు లభ్యమైంది.  వారం రోజుల తర్వాత సామానగర్ వద్ద డ్రైనేజీలో అంతయ్య మృతదేహన్ని గుర్తించారు.


హైదరాబాద్: హైద్రాబాద్‌ సాహెబ్‌నగర్‌లోని సామానగర్ వద్ద సోమవారం నాడు మున్సిపల్ కార్మికుడు అంతయ్య డెడ్‌బాడీని గుర్తించారు. ఆరు రోజుల క్రితం మ్యాన్‌హోల్‌లో పనిచేసేందుకు వెళ్లిన శివ, అంతయ్యలు మరణించిన విషయం తెలిసిందే.నిబంధనలకు విరుద్దంగా మ్యాన్‌హోల్‌లో రాత్రిపూట పనికి తీసుకెళ్లిన కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని తోటి కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.

"

also read:అర్థరాత్రి డ్రైనేజీ క్లీనింగ్: సాహెబ్ నగర్ లో ఇద్దరిని మింగేసిన మ్యాన్ హోల్

శివ డెడ్‌‌బాడీ మరునాడే లభ్యమైంది. కానీ ఇవాళ సామానగర్ వద్ద అంతయ్య డెడ్ బాడీ లభ్యమైంది.ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన శివ, అంతయ్యలు రోజూ కూలీ చేసుకొని పొట్ట పోసుకొంటారు. సైదాబాద్‌లోని చింతల్‌బస్తీలో నివాసం ఉంటారు. సాహెబ్‌నగర్ లో డ్రైనేజీలు నిండిపోయాయని సూపర్‌వైజర్లు వీరిద్దరిని ఈ నెల 4వ తేదీన తీసుకెళ్లారు.మ్యాన్ హోల్ లో దిగి డ్రైనేజీని క్లీన్ చేసే క్రమంలో తొలుత శివ , ఆ తర్వాత అంతయ్య చనిపోయాడు. శివ డెడ్ బాడీ వెంటనే లభ్యమైంది. కానీ అంతయ్య డెడ్ బాడీ మాత్రం ఇవాళ లభ్యమైంది.జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వకుండాన కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా రాత్రి పూట డ్రైనేజీ క్లీనింగ్ పనులు చేయించడం వల్ల ఈ పరిస్థితి నెలకొందనే కార్మికులు ఆరోపిస్తున్నారు.