Asianet News TeluguAsianet News Telugu

తిరుపతి-సికింద్రాబాద్ మార్గంలో మరో వందేభారత్... వారంలో ఆరు రోజులు...

సికింద్రాబాద్-తిరుపతిల మధ్య  వందే భారత్ ఎక్స్ప్రెస్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ మేరకు గత రాత్రి సంబంధిత వర్గాలకు సిద్ధంగా ఉండాలని సమాచారం అందింది. 

Another Vande Bharat on the Tirupati-Secunderabad route, hyderabad - bsb
Author
First Published Mar 25, 2023, 8:45 AM IST

హైదరాబాద్ : రెండు తెలుగు రాష్ట్రాల మధ్య మరో వందే భారత్ ఎక్స్ప్రెస్ సేవలందించనుంది. సికింద్రాబాద్-తిరుపతిల మధ్య  వందే భారత్ ఎక్స్ప్రెస్ త్వరలో పట్టాలు ఎక్కనుంది. రైల్వే వర్గాల సమాచారం ప్రకారం.. సికింద్రాబాద్-తిరుపతిల మధ్య వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు సేవలు ఉంటాయని.. దీనికి సంబంధించి నిర్వహణపరమైన ఏర్పాట్లు చేసుకొని.. సిద్ధంగా ఉండాలని  గురువారం రాత్రి సంబంధిత రైల్వే డివిజన్ అధికారులకు దక్షిణ మధ్య రైల్వే సమాచారం అందించింది. కాగా, ఈ రైలు వారంలో ఆరు రోజుల పాటు అందుబాటులో ఉండనుంది. 

ఈ రైలు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి నల్గొండ, గుంటూరుల మీదుగా తిరుపతి చేరనుంది. సంక్రాంతి రోజున ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ ల మధ్య.. తొలి వందే భారత్ ఎక్స్ప్రెస్ ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ వందే భారత్  ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్-విశాఖపట్నంల మధ్య నడుస్తోంది. ఈ రైలుకు మంచి ఆదరణ లభిస్తుంది. ఈ నేపథ్యంలోనే సికింద్రాబాద్-తిరుపతిల మధ్య వందే భారత్ ఎక్స్ప్రెస్ మంచి ఆదరణ పొందుతుందని విశ్వసిస్తున్నారు. 

హైదరాబాద్ లో కారు మెకానిక్ షెడ్ లో అగ్నిప్రమాదం.. సెక్యూరిటీ గార్డ్ సజీవ దహనం..

నిత్యం వేల సంఖ్యలో హైదరాబాదు నుంచి తిరుపతికి భక్తులు ప్రయాణిస్తుంటారు. తిరుపతి వెళ్లాలనుకునేవారికి నాలుగైదు వారాల ముందు ప్రయత్నిస్తే తప్ప ఈ రైళ్లలో టికెట్లు రిజర్వేషన్ దొరకదు. ప్రయాణికుల నుంచి ఉన్న ఈ భారీ డిమాండ్ ను దృష్టిలో ఉంచుకొని రైల్వే శాఖ సికింద్రాబాద్-తిరుపతిల మధ్య వందే భారత్ ఎక్స్ప్రెస్ సేవలకు శ్రీకారం చుట్టింది. సికింద్రాబాద్ నుంచి తిరుపతికి…. కాజీపేట-విజయవాడ, నల్గొండ-గుంటూరు,  మహబూబ్నగర్- కర్నూలు, వికారాబాద్ - తాండూరు-రాయచూరు..  లాంటి నాలుగు మార్గాల్లో ప్రస్తుతం రైళ్లు రాకపోకలు కొనసాగిస్తున్నాయి.

ఇక.. సికింద్రాబాద్-తిరుపతిల మధ్య ప్రవేశపెట్టబోతున్న వందే భారత ఎక్స్ప్రెస్ ను నల్గొండ-మిర్యాలగూడ-గుంటూరు మార్గంలో నడిపించాలని రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. అయితే, ఈ మార్గంలో వందే భారత్ రైలు ఏ ఏ స్టేషన్లలో ఆగుతుంది. చార్జీలు ఎలా ఉండబోతున్నాయి? ప్రయాణ సమయం ఎంతసేపు ఉంటుంది..  అనేదానిమీద స్పష్టత ఇంకా రావాల్సి ఉంది.  కాగా సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ ఎక్స్ప్రెస్ ను ఏప్రిల్ 8న ప్రారంభించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. అయితే,  రెండు తెలుగు రాష్ట్రాల మధ్య మొదటి వందే భారత్ ఎక్స్ప్రెస్ ను సికింద్రాబాద్ లో ప్రారంభించిన సంగతి తెలిసిందే.  దీంతో ఇప్పుడు ప్రవేశ పెట్టబోతున్న రెండో ఎక్స్ప్రెస్ ను తిరుపతిలో ప్రారంభించనున్నట్లు సమాచారం.

Follow Us:
Download App:
  • android
  • ios