వరంగల్: తెలంగాణలోని వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంటలో జరిగిన హత్యల కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. గొర్రెకుంటలోని ఓ బావిలో 9 మంది మృతదేహాలు తేలడం రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ హత్యల వెనక ఓ మహిళ అదృశ్యం సంఘటన ఉన్నట్లు తెలుస్తోంది.

మక్సూద్ బంధువైన ఓ మహిళ కొద్ది నెలలుగా కనిపించడం లేదని, ఆ మహిళ గురించి చెప్పాలని మక్సూద్ సంజయ్ కుమార్ యాదవ్ మీద ఒత్తిడి తెస్తూ వస్తున్నాడని, ఆ ఒత్తిడిని తట్టుకోలేక కూడా సంజయ్ కుమార్ యాదవ్ మక్సూద్ కుటుంబాన్ని మట్టుబెట్టినట్లు చెబుతున్నారు. 

See Video: తేలాల్సింది: అక్రమ సంబంధమా, ఆర్థిక లావాదేవిలా?

ఆ మహిళను సంజయ్ కుమార్ యాదవ్ రెండు నెలల క్రితం మాయం చేశాడని మక్సూద్ భావిస్తూ వస్తున్నట్లు తెలుస్తోంది. సంజయ్ కుమార్ యాదవ్ ఆ మహిళను రైలు నుంచి కిందికి తోసేసినట్లు పుకార్లు కూడా ఉన్నాయి. సంజయ్ కుమార్ యాదవ్ కూల్ డ్రింక్స్ లో నిద్రమాత్రలు కలిపి మక్సూద్ కుటుంబ సభ్యులకు, ఇద్దరు బీహారీ యువకులకు ఇచ్చాడు. వారు స్పృహ తప్పిన తర్వాత గోనెసంచుల్లో చుట్టి బావిలో పడేశాడని చెబుతున్నారు .

హత్యలకు సంజయ్ కుమార్ యాదవ్ కు మరో ఇద్దరు యువకులు సహకరించినట్లు తెలుస్తోంది. నిందితులను పోలీసులు సోమవారం సాయంత్రం మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. కేసును పోలీసులు 24 గంటల లోపలే ఛేదించారు. 

Also Read: బావిలో మృతదేహాల మిస్టరీ: సంజయ్ కుమార్ భార్య అదృశ్యం

తెలంగాణలోని వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంట గన్నీ సంచుల గోదాం సమీపంలోని బావిలో తేలిన తొమ్మిది మృతదేహాల మిస్టరీ వీడింది. బావిలో శవాలై తేలినవారంతా హత్యకు గురైనట్లు పోలీసులు తేల్చారు. తానే వారిని హత్య చేసినట్లు బీహారీ కార్మికుడు సంజయ్ కుమార్ యాదవ్ అంగీకరించినట్లు తెలిసింది. 

ముందు రచించిన పథకం ప్రకారం... వరంగల్ నగరంలోని నాలుగైదు మెడికల్ షాపుల నుంచి సంజయ్ కుమార్ నిద్రమాత్రలు కొనుగోలు చేశాడు. హత్య చేసే రోజు కూల్ డ్రింక్స్ లో నిద్రమాత్రులు కలిపి స్నేహితులతో కలిసి హత్య చేసినట్లు చెబుతున్నారు. నిద్ర మాత్రల ప్రభావంతో వారు అపస్మారక స్థితిలోకి వెళ్లగానే బతికుండగానే స్నేహితుల సాయంతో వారందరినీ బావిలో పడేసినట్లు చెబుతున్నారు.