Asianet News TeluguAsianet News Telugu

టీఆర్ఎస్‌కు షాక్...కాంగ్రెస్ గూటికి 30 మంది ఎంపిటీసిలు

నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్సీగా ఉంటూ భూపతిరెడ్డి ఇటీవలే కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్న విషయం తెలిసిందే. టీఆర్ఎస్ పార్టీ నుండి నిజామాబాద్ రూరల్ టికెట్ ఆశించి భంగపడటంతో అతడు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నాడు.  పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో కొద్దిరోజుల క్రితమే భూపతి రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరాడు.

another shock to trs party in nizamabad
Author
Hyderabad, First Published Oct 12, 2018, 8:25 PM IST

నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్సీగా ఉంటూ భూపతిరెడ్డి ఇటీవలే కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్న విషయం తెలిసిందే. టీఆర్ఎస్ పార్టీ నుండి నిజామాబాద్ రూరల్ టికెట్ ఆశించి భంగపడటంతో అతడు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నాడు.  పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో కొద్దిరోజుల క్రితమే భూపతి రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరాడు.

అయితే ఎమ్మెల్సీ పదవిలో ఉండి భూపతి రెడ్డి పార్టీని వీడటంతో జిల్లాలో టీఆర్ఎస్ పార్టీకి కాస్త ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. అయితే మెల్లమెల్లగా ఆ పరిస్థితులను చక్కదిద్దుతున్న టీఆర్ఎస్ కు మరోసారి భూపతిరెడ్డి షాకిచ్చాడు.

నిజామాబాద్ జిల్లాకు చెందిన 30 మంది ఎంపీటీసీలు, 50 మంది మాజీ సర్పంచ్‌లు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీ భవన్‌లో ఈ కార్యక్రమం జరిగింది. ఇలా కాంగ్రెస్ పార్టీలో చేరినవారంతా భూపతిరెడ్డి అనుచరులే కావడం విశేషం.

ఈ కార్యక్రమంలో భూపతి రెడ్డి మాట్లాడుతూ... కేసీఆర్ పరిపాలనపై విరుచుకుపడ్డాడు. తెలంగాన యువకులకు ఉద్యోగాలిస్తానని గద్దెనెక్కిన కేసీఆర్... ఆ తర్వాత వారిని విస్మరించి నిరుద్యోగ తెలంగాణను తయారుచేశాడని విమర్శించారు. యువతకు, ప్రజలకు అన్యాయం చేసిన టీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ ను ఓడించడానికే తాను కాంగ్రెస్‌ పార్టీలో చేరినట్లు భూపతిరెడ్డి తెలిపారు.

సంబంధిత వార్తలు

టీఆర్ఎస్‌కు షాక్: కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్సీ భూపతిరెడ్డి, సినీ నిర్మాత బండ్ల గణేష్

పార్టీ ఓటమి కోసం పనిచేస్తా: టీ ఆర్ఎస్ ఎమ్మెల్సీ భూపతిరెడ్డి తిరుగుబాటు

Follow Us:
Download App:
  • android
  • ios