మరో తెలంగాణ జర్నలిస్టు గుండెపోటుతో మృతి

another journalist death
Highlights

విషాధ వార్త

ఇటీవల కాలంలో గుండెపోటుతో మరణిస్తున్న జర్నలిస్టుల సంఖ్య పెరిగిపోతున్నది. వయసుతో సంబంధం లేకుండా జర్నలిస్టులు గుండెపోటుకు గురై మరణిస్తున్నారు. బుధవారం సాయంత్రం తెలంగాణ జర్నలిస్టు ఒకరు గుండెపోటుతో మరణించారు.

భారత్ టుడే చానల్ లో పనిచేస్తున్న నవీన్ అనే జర్నలిస్టుకు గుండెపోటు వచ్చి మృతిచెందారు. ఆయన వయసు 29. చిన్న వయసులోనే గుండెపోటుతో మరణించడంతో జర్నలిస్టు వర్గాల్లో ఆందోళన నెలకొంది. ఈటివిలో ఆఫీస్ బాయ్ గా కెరీర్ ప్రారంభించిన నవీన్ జర్నలిస్టుగా మారి భారత్ టుడే చానల్ లో హెచ్ ఓడి గా పనిచేస్తున్నారు.

జర్నలిస్ట్ నవీన్ మృతి పట్ల జర్నలిస్టు సంఘాలు సంతాపం తెలిపాయి.

loader