వరంగల్ కు చెందిన జ్యోతిగా గుర్తింపు

జాత్యహంకార దాడులు అమెరికాలో కొనసాగుతూనే ఉన్నాయి. కూచిభోట్ల శ్రీనివాస్ మృతి అనంతరం అక్కడి చట్ట సభలు కూడా జాతి వివక్షతపై కఠిన చర్యలు తీసుకుంటామని చెబుతున్నా అవన్నీ ఆచరణలో కనిపించడం లేదు.

కూచిభొట్ల మృతి తర్వాత సూపర్ మార్కెట్ ను నడుపుతున్న మరో భారతీయుడిని కూడా జాతి వివక్షతో కాల్చిచంపారు.

రెండు రోజుల కిందట ఓ సిక్కు యువకుడిపై వాషింగ్టన్ లో కాల్పులకు తెగబడ్డారు. ప్రస్తుతం అతడు ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు.

తాజాగా వరంగల్ కు చెందిన ఓ యువతిపై అమెరికాలో ఓ నల్లజాతి యువకుడు కాల్పులకు తెగబడ్డాడు.

ఈ ఘటనలో ఆమె చేతికి తీవ్రగాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. బాధితురాలు వరంగల్‌ జిల్లాకు చెందిన జ్యోతిగా గుర్తించారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఇంకా తెలియరాలేదు.