Asianet News TeluguAsianet News Telugu

నటి చౌరాసియాపై దాడి : కేబీఆర్ పార్కులో మరో ఘటన.. నిందితుడు కొమ్ము బాబుపై ఇంకో కేసు...

సినీ నటి షాలూ చౌరాసియాపై దాడికి పాల్పడిన నిందితుడు కొమ్ము బాబు ఈ నెల 2న కేబీఆర్ పార్క్ వద్ద మరో యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. అంతే కాకుండా.. డబ్బులు ఇవ్వకుంటే లైంగిక దాడికి పాల్పడతానంటూ బెదిరించి రూ.2,500 లాక్కున్నాడని బాధితురాలు తెలిపింది. అయితే ఆ సమయంలో భయంతో బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. 

Another case against accused who attacked actress Chaurasia
Author
Hyderabad, First Published Nov 22, 2021, 11:04 AM IST

హైదరాబాద్ : నగరంలోని కేబీఆర్ పార్కు వద్ద మరో ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సినీ నటి షాలూ చౌరాసియాపై దాడికి పాల్పడిన నిందితుడు kommu babu ఈనెల 2న KBR Park వద్ద మరో యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. అంతే కాకుండా.. డబ్బులు ఇవ్వకుంటే లైంగిక దాడికి పాల్పడతానంటూ బెదిరించి రూ.2,500 లాక్కున్నాడని బాధితురాలు తెలిపింది. 

భయంతో పోలీసులకు ఫిర్యాదు చేయలేదని పేర్కొన్న బాధిత యువతి.. నిందితుడు అరెస్ట్ కావడంతో Banjarahills policeలకు ఫిర్యాదు చేసినట్టు తెలిపింది. ఈ నెల 14న నటి షాలూ చౌరాసియా మీద దాడి కేసులో నిందితుడు కొమ్ము బాబును పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. సినీ పరిశ్రమలో లైట్ బాయ్ గా పనిచేస్తున్న బాబు యూసఫ్ గూడ, కృష్ణానగర్ నివాసం ఉంటున్నాడు. 

విజయవాడ, బంజారాహిల్స్, గోల్కొండ పీఎస్ ల్లో అతడిపై గతంలో కేసులు నమోదైనట్లు పోలీసులు గుర్తించారు. గోల్కొండ పీఎస్ లో నమోదైన కేసులో కొంతకాలంపాటు జైలులో కూడా ఉన్నాడు. 

నవంబర్ 14 ఆదివారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో నటి Shalu chaurasiya జాగింగ్ కోసం కేబీఆర్ పార్క్ కి వెళ్లింది. పార్క్ ఔటర్ ట్రాక్ పై జాగింగ్ చేస్తున్న చౌరాసియాపై ఓ దుండగుడు అమాంతంగా దాడికి దిగాడు. ఆమెను పక్కనే ఉన్న పొదల్లోకి లాక్కెళ్లాడు. ఆమెతో అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు... మెడ, పెదవులపై గాయాలు చేశాడు. ఈ హఠాత్పరిణామంతో షాక్ కి గురైన ఆమె ప్రతిఘటించారు. ఈ క్రమంలో చౌరాసియాకు గాయాలయ్యాయి. 

దాడి అనంతరం చౌరాసియా ఆపిల్ మొబైల్ లాక్కొని అక్కడ నుండి నిందితుడు పారిపోయాడు. అక్కడినుంచి బయటపడ్డ నటి చౌరాసియా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసు సీరియస్ గా తీసుకున్న పోలీసులు బృందాలుగా ఏర్పడి నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. CCTV footage ఆధారాలతో పాటు, పాత నేరస్థులను విచారించారు. 

నటిపై దాడి చేసి మొబైల్ లాక్కెళ్లిన దొంగ

ఈ కేసు మీద దర్యాప్తులో భాగంగా కృష్ణానగర్ కి చెందిన అరవై మంది నేరస్థులను ఆరా తీశారు. చిత్ర పరిశ్రమతో సంబంధాలున్న నేరస్థులపై కూడా నిఘా ఉంచారు. కాగా ఈ నేరానికి పాల్పడింది బాబు అనే వ్యక్తి అని తేల్చిన పోలీసులు అతడిని 
Arrest చేశారు. దాడి చేయడం వెనుక అతని ఉద్దేశం ఏమిటనే కోణంలో విచారిస్తున్నారు. హై ప్రొఫైల్ వ్యక్తులు Jogging కి వచ్చే కేబీఆర్ పార్క్ లో ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడం, సిటీ భద్రతా ప్రమాణాలపై అనుమానాలు రేకెత్తించింది. పోలీసులు వెంటనే చాక చక్యంగా నిందితుడ్ని పట్టుకొని, కేసును చేధించారు. 

దాడికి గురైన చౌరాసియా ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఆమె షాక్ నుండి ఇంకా కోలుకోలేదని సమాచారం. ముఖం, మెడతో పాటు ఆమె కాలి మీద కూడా గాయాలయ్యాయి. సంఘటన అనంతరం నటి తల్లి, స్నేహితుడు అక్కడకు చేరుకున్నారు. కాగా విచారణలో భాగంగా నిందితుడు బాబు గురించి మరికొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios