Asianet News TeluguAsianet News Telugu

సంగారెడ్డిలో కరోనా కలకలం.. గురుకులంలో మరో 25 మంది విద్యార్థినులకి అస్వస్థత..

ముత్తంగి గురుకులంలో కోవిడ్ టెస్టుల్లో నెగటివ్ వచ్చినా 25 మంది విద్యార్థినులకు వాంతులు, విరేచనాలయ్యాయి. ముగ్గురికి తీవ్రంగా ఉండటంతో వారిని సంగారెడ్డి ఆస్పత్రికి తరలించారు. ఈ 25 మందికి RTPCR testలు చేయాలని వైద్యులు చెప్పారు. మరోవైపు నిన్న చేసిన పరీక్షల్లో కరోనా పాజిటివ్ వచ్చిన విద్యార్థినులను తల్లిదండ్రులు ఇళ్లకు తీసుకుపోయారని పాఠశాల ప్రిన్సిపల్ చెప్పారు. 

another 25 students fall illness in muthangi gurukulam, sangareddy
Author
Hyderabad, First Published Nov 30, 2021, 12:51 PM IST

పటాన్ చెరు : సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం ముత్తంగి గ్రామ పరిధిలోని జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో 25 మంది బాలికలు అస్వస్థతకు గురయ్యారు. ఈ గురుకులంలో నిన్న 47మంది విద్యార్థినులు కోవిడ్ బారిన పడిన సంగతి తెలిసిందే.

కాగా muthangi gurukulam కోవిడ్ టెస్టుల్లో నెగటివ్ వచ్చినా 25 మంది విద్యార్థినులకు వాంతులు, విరేచనాలయ్యాయి. ముగ్గురికి తీవ్రంగా ఉండటంతో వారిని సంగారెడ్డి ఆస్పత్రికి తరలించారు. ఈ 25 మందికి RTPCR testలు చేయాలని వైద్యులు చెప్పారు. మరోవైపు నిన్న చేసిన పరీక్షల్లో కరోనా పాజిటివ్ వచ్చిన విద్యార్థినులను తల్లిదండ్రులు ఇళ్లకు తీసుకుపోయారని పాఠశాల ప్రిన్సిపల్ చెప్పారు. 

ఇదిలా ఉండగా, సోమవారం Sangareddy District పటాన్ చెరు మండలం ముత్తంగి గురుకుల పాఠశాలలో కరోనా కలకలం రేగింది. 42 మంది విద్యార్థులు, ఒక ఉపాధ్యాయురాలు కరోనా బారినపడ్డారు. ఈ గురుకుల పాఠశాలలో 491మంది విద్యార్థులు, 27మంది సిబ్బంది ఉన్నారు. నిన్న 261 మంది విద్యార్థులు, 27 మంది సిబ్బందికి Corona testsలు నిర్వహించగా.. 43 మందికి కోవిడ్ నిర్థారణ అయ్యింది. 

మిగతా వారికి ఇవాళ కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. Corona positive వచ్చిన వారి నమూనాలను వైద్యాధికారులు Genome sequencing కు పంపారు. వసతి గృహంలోనే క్వారంటైన్ ఉంచి విద్యార్థులకు వైద్య సేవలు అందిస్తున్నారు. కరోనా బారిన పడిన విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యారోగ్య శాఖ తెలిపింది. మూడు రోజుల క్రితం ఓ Student అస్వస్థతకు గురి కావడంతో వైద్య పరీక్షలు నిర్వహించగా కోవిడ్ నిర్థారణ అయ్యింది. దీంతో నిన్న విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. దీంతో 43 మందికి పాజిటివ్ గా తేలింది. 

ఇదిలా ఉండగా, కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వణికిస్తోంది. దక్షిణాఫ్రికాలో బయటపడిన ఈ వేరియంట్ తో ప్రపంచదేశాలు అలర్ట్ అయ్యాయి. కాగా  Karnatakaలోని ఓ మెడికల్ కాలేజీ Corona Hotspotగా మారింది. 77 కేసులతో ఈ Medical Collegeవార్తాలకు ఎక్కిన సంగతి తెలిసిందే. కానీ, ఈ Cases మరిన్ని పెరిగాయి. తాజాగా ధార్వాడ్ ఎస్‌డీఎం మెడికల్ సైన్సెస్ కాలేజీలో ఈ కేసుల సంఖ్య 281కు పెరిగాయి. ఈ కాలేజీని ఉత్తర కర్ణాటక మెడికల్ హబ్‌గా పేర్కొంటారు. 

సంగారెడ్డిలో కరోనా కలకలం.. గురుకులంలో టీచర్ తో సహా, 42 మంది విద్యార్థులకు పాజిటివ్..

కానీ, ఈ కాలేజీలోనే కేసులు భారీగా రిపోర్ట్ కావడంతో రాష్ట్రంలోనే కాదు.. దేశవ్యాప్తంగా ఆందోళనలు వస్తున్నాయి. కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి కే సుధాకర్ ఈ కేసుల గురించి ధార్వాడ్ జిల్లాలోని ఎస్‌డీఎం మెడికల్ సైన్సెస్ కాలేజీ 281 కేసులతో కొవిడ్-19 క్లస్టర్‌గా మారిందని అన్నారు. ‘ఆ కాలేజీలో కల్చరల్ ఫెస్ట్ జరిగినట్టు తెలిసింది. ఆ కార్యక్రమం ద్వారానే కేసులు భారీగా పెరిగినట్టు చెప్పారు. 

కానీ, రాష్ట్రంలో ఇప్పటికి ఇప్పుడే ఆంక్షలు విధించే పరిస్థితులు లేవని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పెళ్లిళ్లు, ఇతర కార్యక్రమాలు నిరాటంకంగా జరుగుతున్నాయని వివరించారు.ఎస్‌డీఎం కాలేజీలో ఉన్నపళంగా కేసులు భారీగా రిపోర్ట్ కావడంతో యాజమాన్యం చర్యలకు ఉపక్రమించింది. ఈ కాలేజీ ఎంట్రీ, ఎగ్జిట్ గేట్లను మూసేసింది. కరోనా నెగెటివ్ ఉన్నవారిని మాత్రమే బయటకు విడిచి పెడుతున్నది. అంతేకాదు, ప్రస్తుతం ఎస్‌డీఎం కాలేజీకి అర్ద కిలోమీటరు దూరం పరిధిలోని ఇతర పాఠశాలలనూ మూసేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios