మూడు రోజుల క్రితం సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం ముత్తంగి గురుకుల పాఠశాలలో. ఓ విద్యార్థి అస్వస్థతకు గురి కావడంతో వైద్య పరీక్షలు నిర్వహించగా కోవిడ్ నిర్థారణ అయ్యింది. దీంతో నిన్న విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. దీంతో 43 మందికి పాజిటివ్ గా తేలింది.
సంగారెడ్డి : Sangareddy District పటాన్ చెరు మండలం ముత్తంగి గురుకుల పాఠశాలలో కరోనా కలకలం రేగింది. 42 మంది విద్యార్థులు, ఒక ఉపాధ్యాయురాలు కరోనా బారినపడ్డారు. ఈ గురుకుల పాఠశాలలో 491మంది విద్యార్థులు, 27మంది సిబ్బంది ఉన్నారు. నిన్న 261 మంది విద్యార్థులు, 27 మంది సిబ్బందికి Corona testsలు నిర్వహించగా.. 43 మందికి కోవిడ్ నిర్థారణ అయ్యింది.
మిగతా వారికి ఇవాళ కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. Corona positive వచ్చిన వారి నమూనాలను వైద్యాధికారులు Genome sequencing కు పంపారు. వసతి గృహంలోనే క్వారంటైన్ ఉంచి విద్యార్థులకు వైద్య సేవలు అందిస్తున్నారు. కరోనా బారిన పడిన విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యారోగ్య శాఖ తెలిపింది. మూడు రోజుల క్రితం ఓ Student అస్వస్థతకు గురి కావడంతో వైద్య పరీక్షలు నిర్వహించగా కోవిడ్ నిర్థారణ అయ్యింది. దీంతో నిన్న విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. దీంతో 43 మందికి పాజిటివ్ గా తేలింది.
ఇదిలా ఉండగా, కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వణికిస్తోంది. దక్షిణాఫ్రికాలో బయటపడిన ఈ వేరియంట్ తో ప్రపంచదేశాలు అలర్ట్ అయ్యాయి. కాగా Karnatakaలోని ఓ మెడికల్ కాలేజీ Corona Hotspotగా మారింది. 77 కేసులతో ఈ Medical Collegeవార్తాలకు ఎక్కిన సంగతి తెలిసిందే. కానీ, ఈ Cases మరిన్ని పెరిగాయి. తాజాగా ధార్వాడ్ ఎస్‌డీఎం మెడికల్ సైన్సెస్ కాలేజీలో ఈ కేసుల సంఖ్య 281కు పెరిగాయి. ఈ కాలేజీని ఉత్తర కర్ణాటక మెడికల్ హబ్‌గా పేర్కొంటారు.
కానీ, ఈ కాలేజీలోనే కేసులు భారీగా రిపోర్ట్ కావడంతో రాష్ట్రంలోనే కాదు.. దేశవ్యాప్తంగా ఆందోళనలు వస్తున్నాయి. కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి కే సుధాకర్ ఈ కేసుల గురించి ధార్వాడ్ జిల్లాలోని ఎస్‌డీఎం మెడికల్ సైన్సెస్ కాలేజీ 281 కేసులతో కొవిడ్-19 క్లస్టర్‌గా మారిందని అన్నారు. ‘ఆ కాలేజీలో కల్చరల్ ఫెస్ట్ జరిగినట్టు తెలిసింది. ఆ కార్యక్రమం ద్వారానే కేసులు భారీగా పెరిగినట్టు చెప్పారు.
Mariyamma death case: మరియమ్మ మృతిపై సీబీఐ దర్యాప్తు అవసరం లేదు.. తీర్పు వెలువరించిన హైకోర్టు..
కానీ, రాష్ట్రంలో ఇప్పటికి ఇప్పుడే ఆంక్షలు విధించే పరిస్థితులు లేవని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పెళ్లిళ్లు, ఇతర కార్యక్రమాలు నిరాటంకంగా జరుగుతున్నాయని వివరించారు.ఎస్‌డీఎం కాలేజీలో ఉన్నపళంగా కేసులు భారీగా రిపోర్ట్ కావడంతో యాజమాన్యం చర్యలకు ఉపక్రమించింది. ఈ కాలేజీ ఎంట్రీ, ఎగ్జిట్ గేట్లను మూసేసింది. కరోనా నెగెటివ్ ఉన్నవారిని మాత్రమే బయటకు విడిచి పెడుతున్నది. అంతేకాదు, ప్రస్తుతం ఎస్‌డీఎం కాలేజీకి అర్ద కిలోమీటరు దూరం పరిధిలోని ఇతర పాఠశాలలనూ మూసేశారు.
ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో శానిటైజ్ చేశారు. కాగా, ఇక్కడ ఎనిమిది అంబులెన్సులను సిద్ధం చేసి పెట్టినట్టు తెలిసింది. ఎస్‌డీఎం కాలేజీకి విజిటర్లను నిషేధించారు. శనివారం ఒక్క రోజే కర్ణాటకలో 402 కేసులు నమోదయ్యాయి. కర్ణాటక రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి కే సుధాకర్ ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనలు కలిగిస్తున్న కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పైనా స్పందించారు. కర్ణాటక ప్రభుత్వ పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారని అన్నారు.
రాష్ట్రంలో ఇప్పటి వరకు అయితే, కొత్త వేరియంట్ కేసులు లేవని వివరించారు. అయితే, దక్షిణాఫ్రికా దేశాల నుంచి కర్ణాటకకు వచ్చిన వారిని ట్రేస్ చేయాల్సిందిగా తాను హోం శాఖ, బృహత్ బెంగళూరు మహానగర పాలికేకు తాను ఆదేశాలు జారీ చేశారని అన్నారు. రాష్ట్రంలో ఆరు జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్‌లు ఉన్నాయని వివరించారు. ఇక్కడ ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయా? లేదా? అనే అంశంపైనా శాంపిళ్లను పరీక్షిస్తారని తెలిపారు.
