గతేడాది దారుణంగా చంపి.. ఈ ఏడాది డెత్ యానివర్సరీ..కేక్ కట్ చేసిన నిందితులు

First Published 17, Jul 2018, 11:59 AM IST
anishetty murali manohar murder: accused celebrate death anniversary
Highlights

తెలిసినవారు చనిపోయి ఏడాది అయితే ఎవరైనా బాధపడతారు.. వారితో తమకు గల అనుబంధాన్ని గుర్తుచేసుకుని బాధపడతారు. అలాంటిది సంతోషంగా కేక్ కట్ చేసి పండుగ చేసుకుంటామా..? కానీ వరంగల్‌లో కొందరు మాత్రం డెత్ యానివర్సరీని పండగలా జరుపుకున్నారు.

తెలిసినవారు చనిపోయి ఏడాది అయితే ఎవరైనా బాధపడతారు.. వారితో తమకు గల అనుబంధాన్ని గుర్తుచేసుకుని బాధపడతారు. అలాంటిది సంతోషంగా కేక్ కట్ చేసి పండుగ చేసుకుంటామా..? కానీ వరంగల్‌లో కొందరు మాత్రం డెత్ యానివర్సరీని పండగలా జరుపుకున్నారు. వివరాల్లోకి వెళితే.. గతేడాది టీఆర్ఎస్ కార్పోరేటర్ అనిశెట్టి మురళీ మనోహర్ దారుణ హత్యకు గురయ్యారు..

సాయంత్రం  6.30 ప్రాంతంలో సొంత ఇంట్లోనే ఆయనను ప్రత్యర్థులు వేట కొడవళ్లతో విచక్షణారహితంగా నరికి చంపారు.. అనంతరం రక్తం నిండిన కొడవళ్లను దొరి పొడవునా గాల్లో తిప్పుతూ బైకుల మీద వెళ్లి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయారు. ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ఈ కేసులో నిందితులైన బొమ్మతి విక్రం, చిరంజీవి, వరుణ్‌లను రిమాండ్‌కు తరలించారు పోలీసులు. అనంతరం వీరంతా బెయిల్‌పై బయటకు వచ్చారు.

ఈ నెల 14న బొమ్మతి విక్రమం ఇంట్లో మురళీ డెత్ యానివర్సరీని ఘనంగా నిర్వహించారు.. పీకల దాకా మద్యం సేవించి కేకును కత్తులతో పొడుస్తూ డ్యాన్స్ చేశారు. ఇందుకు సంబంధించిన తతంగాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అది ఇప్పుడు వైరల్ అవుతోంది.     
 

loader