Nehru Zoo Park: జూ పార్క్‌లో ఏనుగు బీభత్సం విషాదం.. ఆహారం పెడుతుండగా మావటిపై..  

Nehru Zoo Park: హైదరాబాద్ లోని నెహ్రూ జూ పార్క్ లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఏనుగు దాడిలో జంతు సంరక్షకుడు మృతి చెందాడు.

Animal keeper killed in elephant attack at Nehru Zoo Park Hyderabad KRJ

Nehru Zoo Park: హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్‌ పార్క్‌లో విషాదం చోటుచేసుకుంది. ఏనుగు దాడి చేయడంతో జంతు సంరక్షకుడు శనివారం మృతి చెందాడు. సమాచారం ప్రకారం.. ఏనుగుల ఎన్‌క్లోజర్‌లో  5-6 మంది జంతు సంరక్షకులు (మావటిలు) విధుల్లో ఉంటారు. అయితే.. శనివారం జూ పార్క్‌‌లో 60 సంవత్సరాల వేడుకలు నిర్వహిస్తున్నారు. దీంతో కొంత మంది సిబ్బంది ఆ వేడుకల్లో పాల్గొన్నారు. దీంతో షాబాజ్‌ (28) ఒక్కరే విధుల్లో ఉన్నారు.

షాబాజ్‌‌ ఆహారం అందించేందుకు వెళ్లగా.. విజయ్ అనే ఏనుగు అతడిపైకి దూసుకొచ్చి, తొండంతో అమాంతం ఎత్తి నేలకేసి కొట్టింది. అనంతరం.. కాలితో తొక్కింది.  ఈ సంఘటన మధ్యాహ్నం 3 గంటలకు జరిగింది. వెంటనే అప్రమత్తమైన ఇతర సిబ్బంది తీవ్రంగా గాయపడిన షాబాజ్‌ను ఎన్‌క్లోజర్ నుండి బయటకు తీసి అపోలో DRDO ఆసుపత్రికి తరలించారు. సాయంత్రం 4 గంటల సమయంలో ఆయన మృతి చెందినట్లు ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు.

ఈ ఘటనపై జూ అధికారులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ.. ఘటనకు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. షాబాజ్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించినట్టు తెలిపారు. జూపార్క్ సిబ్బంది ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios