రైతు బంధు చెక్కును తిరస్కరించిన యాంకర్ సుమ

First Published 21, Jun 2018, 4:17 PM IST
Anchor suma Rejects Rythu Bandhu cheque
Highlights

రైతు బంధు చెక్కును తిరస్కరించిన యాంకర్ సుమ

ప్రముఖ బుల్లితెర యాంకర్ సుమ రైతుబంధు చెక్కును అందుకున్నారు.. జడ్చెర్ల మండలంలోని హేమాజీపూర్ శివార్లలో సుమ కుటుంబానికి వ్యవసాయ పొలం ఉంది.. అందరితో పాటు ప్రభుత్వం వీరికి కూడా రైతు బంధు పథకం కింద చెక్కును ప్రకటించింది. దీనిని అందుకునేందుకు జడ్చర్ల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి సుమ, రాజీవ్ కనకాల చేరుకున్నారు. రిజిష్టర్‌లో సంతకం చేసి రూ.29 వేల చెక్కును అందుకున్నారు..

అయితే తాము ఆర్థికంగా స్థిరపడినందున రైతుల సంక్షేమానికి ఉపయోగించాలని కోరుతూ సుమ దంపతులు చెక్కును తిరిగి ప్రభుత్వానికే అందజేశారు.. అనంతరం హేమాజీపూర్‌లోని పాఠశాలకు చేరకుని విద్యార్థులతో ముచ్చటించారు.. గతంలో వీరు ఇదే పాఠశాలకు ప్రొజెక్టర్, ల్యాప్‌ట్యాప్‌లు బహుకరించారు. ఈ సందర్భంగా పలువురు గ్రామస్తులు సుమ దంపతులతో ఫోటోలు దిగారు.
 

loader