మిర్యాలగుడా: మారుతీ రావు చేతిలో హత్యకు గురైన ప్రణయ్ భార్య అమృత వర్షిణి తల్లి గిరిజ వద్దకు వచ్చింది. తండ్రి మారుతీ రావు తన ప్రేమవివాహాన్ని అంగీకరించకుండా తన భర్తను హత్య చేయించిన విషయం తెలిసిందే. ఇటీవల మారుతీ రావు హైదరాబాదులోని ఆర్యవైశ్య భవన్ లో ఆత్మహత్య చేసుకున్నాడు. 

తన కుమారుడిని తీసుకుని వెళ్లి అమృత తన తల్లి గిరిజను కలిసింది. అమృతను చూసి తల్లి ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. దాదాపు 25 నిమిషాల పాటు అమృత తన తల్లి వద్ద ఉంది. తల్లిని ఓదార్చిన అమృత తిరిగి అత్తారింటికి వెళ్లింది.

Also Read: చార్జిషీట్ కు భయపడే మారుతీ రావు ఆత్మహత్య: వాంగ్మూలంలో అమృత ఇలా...

మారుతీరావు భౌతిక కాయాన్ని చివరిసారి చూసేందుకు వెళ్తానని, తనకు రక్షణ కల్పించాలని ఆయన కూతురు అమృత వర్షిణి పోలీసులను కోరారు. దాంతో భద్రత మధ్య అమృతను పోలీసులు శ్మశానవాటికకు తీసుకుని వెళ్లారు అయితే, అక్కడ ఆమెను కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. 

తండ్రి మారుతీరావును చివరిసారి చూడకుండానే ఆమె వెనుదిరిగారు. ఈ క్రమంలో ఆమె బాబాయ్ శ్రవణ్ పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. అదే స్థాయిలో శ్రవణ్ ఆమెకు  కౌంటర్ ఇచ్చారు. ఆ తర్వాత ఎట్టకేలకు శనివారంనాడు ఆమె తల్లి గిరిజ వద్దకు వచ్చి, ఆమెను ఓదార్చారు.  

Also Read: బిగ్ బ్రేకింగ్ : కుప్పకూలిన అమృత, అస్పత్రికి తరలింపు 

దళితుడైన ప్రణయ్ ని తన కూతురు ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో అమృత రావు కక్ష పెంచుకున్నాడు. కిరాయి హంతకులతో ప్రణయ్ ను హత్య చేయించాడు. ఆ కేసులో మారుతీరావు అరెస్టయి బెయిల్ పై విడుదలయ్యారు. ఈ కేసులో పోలీసులు చార్జిషీట్ దాఖలు చేసే తరుణంలో మారుతీ రావు ఆత్మహత్య చేసుకున్నాడు.