తెలుగురాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మిర్యాలగూడ ప్రణయ్ హత్యకేసులో ప్రధాన నిందితుడు మారుతిరావు పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. పట్టణ శివారులోని అతడికి సంబంధించిన ఓ పాడుబడిన షెడ్ లో రక్తపుమడుగులో ఓ మృతదేహం లభించింది. దీంతో మిర్యాలగూడలో మరోసారి కలకలం మొదలయ్యింది. మారుతిరావు షెడ్ లో ఈ  మృతదేహం లభించడం మరింత చర్చనీయాంశంగా మారింది. 

 పాడుబడిన షెడ్ లో ఓ మృతదేహం వున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో స్థానిక పోలీసులు అక్కడికి చేరుకుని ఆ షెడ్ ఎవరిదో ఆరా తీశారు. అయితే     అది rమారుతిరావుది అని తెలిసింది. 

 read more ప్రణయ్ హత్య కేసు: అమృత తండ్రి మారుతీరావుకు బెయిల్ మంజూరు

 గుర్తుపట్టకుండా మృతదేహంపై ఆయిల్ చల్లివుంది. దాదాపు వారం రోజుల క్రితం మృతిచెంది వుంటాడని అనుమానిస్తున్నారు. ఎక్కడైన హత్యచేసి ఇక్కడికి తెచ్చి పడేశారా లేక ఇక్కడే హత్య జరిగిందా అన్న కోణంలో పోలీసులు విచారణ సాగిస్తున్నారు. 

ప్రస్తుతానికి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే మృతదేహం మారుతిరావుకు చెందిన షెడ్ లో లభించింది కాబట్టి అతడి పాత్ర ఏమయినా వుందా అన్న అనుమానాలు మొదలయ్యాయి. 

read more  ప్రణయ్ హత్య కేసు: అమృత ఫిర్యాదు, మరోసారి మారుతీ రావు అరెస్ట్

ఇప్పటికే తన కూతురు అమృతను ప్రేమ వివాహం చేసుకున్నాడన్న కోపంతో ప్రణయ్ అనే దళిత యువకున్ని చంపిక కేసులో మారుతిరావు ప్రధాని నిందితుడు. ఇటీవలే అతడే బెయిల్ పై బయటకు వచ్చాడు. తాజా ఘటనతో అతడు మరో వివాదంలో చిక్కుకున్నాడు.