Asianet News TeluguAsianet News Telugu

కెసిఆర్ సవాలు స్వీకరించిన అమిత్

రాజీనామాల దాకా అవసరం లేదుకానీ తెలంగాణాలో ఏ శాఖకు, ఏ పథకాలకు, పనులకు కేంద్రం లక్ష కోట్ల రూపాయలు ఇచ్చిందో చెప్పటం నిజంగా అమిత్ షాకు చాలా తేలిక. కాకపోతే చెప్పాలన్న చిత్తశుద్ది ఉండాలంతే. కెసిఆర్ చేత రాజీనామా చేయించాలంటే భాజపాకు నిజంగా ఇది గోల్డెన్ ఛాన్సే. ఏమంటారు?

Amitshah accepts kcr challenge

లెక్కలపై తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ సవాలును అమిత్ షా స్వీకరించారు. తెలంగాణా పర్యటనలో మాట్లాడుతూ, కేంద్రప్రభుత్వం తెలంగాణాకు లక్ష కోట్ల రూపాయలు ఇచ్చిందని అమిత్ షా చెప్పిన సంగతి తెలిసిందే కదా? దానిపై కెసిఆర్ తీవ్రంగా స్పందించారు. ‘కేంద్రం గనుక తెలంగాణాకు లక్ష కోట్ల రూపాయలు ఇచ్చినట్లు లెక్కలు చూపిస్తే తాను ముఖ్యమంత్రిగా రాజీనామా చేస్తా’నంటూ సవాలు కూడా విసిరారు. తర్వాత రాష్ట్రస్ధాయిలో సవాళ్ళు-ప్రతిసవాళ్లు అనేకం జరిగాయనుకోండి అది వేరే సంగతి.

 

అయితే, తెలంగాణా నుండి ఏపికి వచ్చిన అమిత్ షా కెసిఆర్ సవాలు విషయంలో ఏమీ మాట్లాడలేదు. కానీ ఢిల్లీకి తిరిగి వెళ్ళగానే ఈరోజు కెసిఆర్ సవాలుపై స్పందించటం విశేషం. కేంద్రం, తెలంగాణాకు లక్ష కోట్ల రూపాయలు ఇచ్చింది వాస్తవమన్నారు. తాను చెప్పిన లెక్కలు తప్పైతే రుజువు చేయాలని కూడా అన్నారు. అయితే, ఇక్కడే అందరికీ ఓ సందేహం వస్తోంది. కేంద్రం తెలంగాణాకు లక్ష కోట్లు ఇచ్చిందని చెప్పింది అమిత్ షానే. అదే నిజమైతే లెక్కలు చెప్పాల్సిన బాధ్యత కూడా అమిత్ షాదే.

 

గతంలో ఇదే విషయమై కేంద్రమంత్రులకు, తెలంగాణా మంత్రులకు పెద్ద వివాదం రేగింది. అప్పుడు కూడా కేంద్రం తెలంగాణాకు లక్ష కోట్ల రూపాయలు ఇచ్చిందని చెప్పటం శుద్ధ అబద్దమంటూ తెలంగాణా మంత్రులు చెప్పారు. మళ్ళీ ఇపుడు అమిత్ షా రూపంలో అదే వివాదం మొదలైంది.

 

రాజీనామాల దాకా అవసరం లేదుకానీ తెలంగాణాలో ఏ శాఖకు, ఏ పథకాలకు, పనులకు కేంద్రం లక్ష కోట్ల రూపాయలు ఇచ్చిందో చెప్పటం నిజంగా అమిత్ షాకు చాలా తేలిక. కాకపోతే చెప్పాలన్న చిత్తశుద్ది ఉండాలంతే. కెసిఆర్ చేత రాజీనామా చేయించాలంటే భాజపాకు నిజంగా ఇది గోల్డెన్ ఛాన్సే. ఏమంటారు?

Follow Us:
Download App:
  • android
  • ios