అప్పటి నుంచి ఆయన పార్టీలో నామ్ కే వాస్తే అన్నట్లుగానే ఉంటున్నారు.

కిషన్ రెడ్డి అలక వెనుక అసలు కారణం ఏంటీ... ?నిన్నటి షా పర్యటనలో ఆయన అంటిముట్టనట్లు ఎందుకు వ్యవహరించారు...?

ఇప్పుడు షానే క్లాసు తీసుకునే పరిస్థితి ఎందుకు తెచ్చుకున్నారు..?

ఇదంతా తెలియాలంటే మూడేళ్లు వెనక్కి వెళ్లాల్సిందే. ముఖ్యంగా గత ఎన్నికల వేళ తెలంగాణలో టీడీపీతో బీజేపీపొత్తు పెట్టుకోవడం కిషన్ రెడ్డితో పాటు తెలంగాణ బీజేపీ నేతలకు అస్సలు నచ్చలేదు.

కానీ, వెంకయ్య ఒత్తిడితో అధిష్టానం టీడీపీతో జతకట్టింది. దీంతో ఎన్నికల ఫలితాల్లో బీజేపీ బొక్కబోర్లాపడింది. ఆ తర్వాత కిషన్ రెడ్డి పదవీ పోయింది.

అప్పటి నుంచి ఆయన పార్టీలో నామ్ కే వాస్తే అన్నట్లుగానే ఉంటున్నారు.

నిన్న పార్టీ అధినేత షా పర్యటన సమయంలోనూ ఆయన వ్యవహారం అలానే సాగింది. సహపంక్తి భోజనాల సమయంలోనూ ఆయన కనిపించలేదు. సభ వేదికపై పిలిచినా రాలేదు.

ఈ విషయం అమిత్ షా కు తెలియడంతో ఈ రోజు కిషన్ రెడ్డికి క్లాసు తీసుకున్నట్లు తెలిసింది.

ఆయనను తన గెస్ట్‌ హౌస్‌కు పిలుపించుకుని మందలించినట్టు చెబుతున్నారు. పార్టీ కోసం పనిచేయాలని ఈగోలు పక్కన పెట్టాలని ఆయనకు సూచించారట.