హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న హైదరాబాద్ విమోచన దినోత్సవంకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న హైదరాబాద్ విమోచన దినోత్సవంకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈరోజు ఉదయం పరేడ్ గ్రౌండ్స్‌కు చేరుకున్న అమిత్ షా.. తొలుత వార్ మెమోరియల్ వద్ద నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం వద్ద నివాళులర్పించారు. తర్వాత కేంద్ర బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం సభలో ప్రసగించనున్నారు. ఇక, విమోచ దినోత్సవం సందర్భంగా పరేడ్ గ్రౌండ్స్‌లో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయం ఉట్టిపడేలా కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.
ఇదిలాఉంటే.. నాటి హైదరాబాద్ సంస్థాన ప్రజలందరికీ హైదరాబాద్ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు అని అమిత్ షా పేర్కొన్నారు. ఈ మేరకు ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ‘‘నిజాం దుష్ట పాలన, అణచివేత నుండి విముక్తి కోసం హైదరాబాద్ సంస్థాన ప్రజలు సాగించిన అలుపెరగని పోరాటానికి, ఇక్కడి ప్రజల అచంచల దేశభక్తికి ఈ రోజు నిదర్శనం. హైదరాబాద్ విముక్తి పోరాటంలో అమరులైన వీరులందరికీ నా హృదయపూర్వక నివాళులు’’ అని అమిత్ షా పేర్కొన్నారు.
ఇక,1948 సెప్టెంబర్ 17న ఆపరేషన్ పోలో తర్వాత హైదరాబాద్ సంస్థానం ఇండియన్ యూనియన్ చేరిన రోజు.. దీనిని కేంద్ర ప్రభుత్వం విమోచన దినోత్సవంగా నిర్వహిస్తోంది. గతేడాది తొలిసారిగా కేంద్రం అధికారికంగా ఈ వేడుకలను నిర్వహించింది. గతేడాది కూడా కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ వేడుకలను హాజరయ్యారు.
