కత్తిని శిక్షించకుండా.. స్వామిజీని బహిష్కరిస్తారా...? అమిత్ షా ఆగ్రహం

amit shah fires over swami paripoornananda bans from hyderabad
Highlights

తెలంగాణ పర్యటనలో భాగంగా బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా ఇవాళ హైదరాబాద్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్, వీహెచ్‌పీ నేతలతో కత్రియా హోటల్‌లో సమావేశమయ్యారు. శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కత్తి మహేశ్‌ను శిక్షించకుండా.. స్వామిజీని ఏ విధంగా నగర బహిష్కరణ చేస్తారని ఆయన ప్రశ్నించినట్టు సమాచారం..

తెలంగాణ పర్యటనలో భాగంగా బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా ఇవాళ హైదరాబాద్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్, వీహెచ్‌పీ నేతలతో కత్రియా హోటల్‌లో సమావేశమయ్యారు.. ఈ క్రమంలో పరిపూర్ణనంద స్వామిని నగర బహిష్కరణ చేసిన అంశం చర్చకు వచ్చింది.. ఈ చర్యపై అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేసినట్లు  తెలుస్తోంది. శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కత్తి మహేశ్‌ను శిక్షించకుండా.. స్వామిజీని ఏ విధంగా నగర బహిష్కరణ చేస్తారని ప్రశ్నించినట్టు సమాచారం..

హిందువులంతా ఏకమై స్వామిజీకి పూర్తి మద్ధతు ఇవ్వాలని షా పిలుపునిచ్చారు. ఈ విషయంలో పార్టీ శ్రేణులు, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు అండగా నిలబడాలని ఆయన సూచించారు. అంతకు ముందు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్‌పోర్టు‌కు చేరుకున్న అమిత్ షాకి బీజేపీ నేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. 

loader