హైద్రాబాద్ సర్ధార్ వల్లభాయ్ పటేల్ పోలీస్ అకాడమీలో 73వ బ్యాచ్ ఐపీఎస్ అధికారుల పాసింగ్ ఔట్ పరేడ్ లో జాతీయ  భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ ఆయన పాల్గొన్నారు.దేశం కోసం అమరవీరులైన 40 మంది ఐపీఎస్ అధికారులను కూడా మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. 

హైదరాబాద్:ప్రజాస్వామ్యం నాయకుల చేతిలో కాదు అధికారుల సుపరిపాలనలో ఉంటుందని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ చెప్పారు.హైద్రాబాద్ సర్ధార్ వల్లభాయ్ పటేల్ పోలీస్ అకాడమీలో 73వ బ్యాచ్ ఐపీఎస్ అధికారుల పాసింగ్ ఔట్ పరేడ్ లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. భారతదేశపు 15 వేల కి.మీ.భూమిపై నిరంతరం చైనా, పాక్, మయన్మార్, బంగ్లాదేశ్ తో సమస్యలున్నాయని ఆయన చెప్పారు. భారత్‌లోని 32 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోని ప్రతి ప్రాంతంలో శాంతిభద్రతలను కాపాడడం పోలీసు బలగాల బాధ్యత అని ధోవల్ చెప్పారు.

also read:Delhi regional security dialogue: అఫ్గాన్ పరిణామాలపై భారత్ కీలక సదస్సు.. పాక్, చైనా డుమ్మా..

మీరంతా పోలీసింగ్ కోసమే IPS శిక్షణ పొందలేదన్నారు. దేశ సరిహద్దు నిర్వహణ కు బాధ్యత వహిస్తారని Ajit Doval అభిప్రాయపడ్డారు. పాకిస్తాన్, చైనా, మయన్మార్, బంగ్లాదేశ్ తో ఇండియాకు సరిహద్దు ఉందన్నారు.. ఆయా దేశాలతో సరిహద్దు సమస్యలున్నాయన్నారు. అయితే సరిహద్దుల్లో పోలీసులు ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్నారని ఆయన చెప్పారు..దేశ వ్యాప్తంగా 21 లక్షల మంది పోలీస్ సిబ్బంది ఉన్నారని, అయితే విధి నిర్వహణలో సుమారు 35,480 మంది ప్రాణ త్యాగం చేశారని ధోవల్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.

దేశం కోసం అమరవీరులైన 40 మంది ఐపీఎస్ అధికారులను కూడా మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు దాటిన సమయంలో India కొత్త శకానికి నాంది పలుకుతుందని భద్రతా సలహదారు తెలిపారు. చట్టాన్ని అమలు చేసే వారు బలహీనంగా, అవినీతిపరులుగా పక్షపాతంతో ఉన్న చోట ప్రజలు సురక్షితంగా, సురక్షితంగా ఉండలేరని ధోవల్ తేల్చి చెప్పారు. Police ఇతర సంస్థలతో కలిసి పనిచేయాలని ఆయన కోరారు. దేశానికి సేవ చసేందుకు మానసిక థృక్పథం అవసరమన్నారు.అంతర్గత భద్రత విఫలమైతే ఏ దేశం గొప్పగా ఉండదన్నారు.ప్రజలు సురక్షితంగా లేకుంటే ఆ దేశం అభివృద్ది చెందదని ఆయన అభిప్రాయపడ్డారు.

52 ఏళ్ల క్రితం తాను కూడా ఐపీఎస్ శిక్షణ పూర్తి చేసుకొన్న విషయాన్ని ఆయన గుర్తు చేసుకొన్నారు. ఏడు దశాబ్దాల పాటు జాతీయ పోలీస్ అకాడమీ నుండి 5700 మంది ఐపీఎస్ లు బయటకు వచ్చారన్నారు. యువ ఐపీఎస్ లపై గురుతర బాధ్యత ఉందని ఆయన చెప్పారు. దేశాభివృద్దిలో భాగస్వామ్యులు కావాలని ఆయన ఐపీఎస్ లను కోరారు. సమాజ అభివృద్దిలో కూడా ఐపీఎస్ లో భాగస్వామ్యులు కావాలని ఆయన సూచించారు.