Asianet News TeluguAsianet News Telugu

చీకోటి ప్రవీణ్ కుమార్‌కు గౌరవ డాక్టరేట్.. ‘మనుషుల్లాగే అన్ని ప్రాణులకూ జీవించే హక్కు’

బీజేపీ నేత చీకోటి ప్రవీణ్ కుమార్‌కు అమెరికాకు చెందిన ఓ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. ఈ భూమిపై మనుషులకున్నంతే ఇతర జీవరాశులకూ హక్కులు ఉన్నాయని చీకోటి ఈ సందర్భంగా తెలిపారు. తనకు ప్రాణులు, జీవజాలం అంటే అమితమైన ప్రేమ అని వివరించారు.
 

america university honorary doctorate to cheekoti pravin kumar kms
Author
First Published Nov 10, 2023, 9:32 PM IST

హైదరాబాద్: చీకోటి ప్రవీణ్ కుమార్ ఈడీ రైడ్లతో కొన్ని రోజులపాటు మీడియాలో కనిపించారు. ఆయన గురించి రకరకాల కథనాలు వచ్చాయి. చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేశాడనే ఆరోపణలూ వచ్చాయి. తాజాగా, చీకోటి ప్రవీణ్ కుమార్‌కు అమెరికాకు చెందిన ఓ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ పురస్కారం అందించింది.

హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో కాలిఫోర్నియాకు చెందిన యునైటెడ్ థియోలాజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ యూనివర్సిటీ.. బీజేపీ నేత చీకోటి ప్రవీణ్‌కు గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. ఈ డాక్టరేట్ పుచ్చుకున్న ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. ఈ భూమిపై నివసించే చరాచర జీవరాసులకు మనిషిలాగే జీవించే హక్కు ఉన్నదని వివరించారు. జంతువులు, పశుపక్ష్యాదులు, చెట్లకు కూడా జీవించే హక్కు ఉన్నదని తెలిపారు. అసలు అవి లేని ప్రపంచంలో మనిషి బతుకలేడని పేర్కొన్నారు.

Also Read: అభ్యర్థులకు లాస్ట్ మినిట్ ట్విస్టులు.. టికెట్లు ప్రకటించి మరీ మొండిచేయి

ప్రాణులంటే తనకు ఇష్టం అని,అందుకే అరుదైన జీవజాతులను జాగ్రత్తగా పెంచుకుంటానని చెప్పారు. వీధి కుక్కలను చూసినా, వాటిని ఎవరైనా కొట్టినా తనకు బాధేస్తుందని తెలిపారు. తాను పాములపై పరిశోధనలు చేసినట్టు వివరించారు. ప్రకృతి ప్రేమికుడినైన తనపై ఈడీ రైడ్స్ జరిగిన తర్వాత విష ప్రచారం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. తన గురించి అవాస్తవాలు ప్రచారం చేశారని అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios