దత్తాత్రేయను పరామర్శించిన అల్లం, చక్రపాణి

First Published 1, Jun 2018, 7:06 PM IST
Allam and Ghanta met Bandaru Dattatreya
Highlights

బాధాకరం

కేంద్ర మాజీ మంత్రి, పార్లమెంటు సభ్యులు బండారు దత్తాత్రేయ కుమారుడు బండారు వైష్ణవ్ ఆకస్మిక మృతి పట్ల తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమి చైర్మన్ అల్లం నారాయణ, తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గంట చక్రపాణిలు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

రాంనగర్ లోని బండారు దత్తాత్రేయ స్వగృహంలో వైష్ణవ్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. చిన్న వయసులోనే బండారు వైష్ణవ్ కుటుంబానికి దూరం కావడం పెను విషాదమని, మెడిసిన్ చేస్తూ ఎంతో భవిషత్తు ఉన్న వైష్ణవ్ అకాల మృతి కలసివేసిందన్నారు. ఈ సందర్బంగా బండారు దత్తాత్రేయ కుటుంబానికి దైర్యం చెప్పారు.

loader