హైకోర్టు అనుమతి.. వేలానికి తొలగిన అడ్డంకులు: కోకాపేట భూముల కోసం రంగంలోకి రియల్టర్లు

కోకాపేట, ఖానామెట్‌లోని ప్రభుత్వ భూముల విక్రయం ప్రక్రియను నిలుపుదల చేయడం కుదరదని తెలంగాణ హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ మేరకు బీజేపీ నేత విజయశాంతి దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో భూముల వేలానికి సర్వం సిద్ధమైంది
 

all set for kokapet lands auction ksp

కోకాపేట భూముల వేలానికి సర్వం సిద్దమైంది. రేపటి భూముల వేలానికి హైకోర్టు అనుమతినిచ్చింది. దీంతో రేపు కోకాపేట్, ఖానామెట్ భూముల వేలం జరగనుంది. ఈ భూముల వేలంపై అందరిలో ఉత్కంఠ నెలకొంది. కోకాపేట్ భూముల కోసం బడా సంస్థలు రంగంలోకి దిగాయి. ఆన్‌లైన్ భూముల వేలాన్ని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎస్‌డీసీ నిర్వహించనుంది. హెచ్‌ఎండీఏకు చెందిన 49 ఎకరాల్లో 7 ఫ్లాట్లను వేలం వేస్తోంది ప్రభుత్వం. వేలంలో 5,000 కోట్లు రావొచ్చని అంచనా వేస్తోంది. 

అంతకుముందు బీజేపీ నేత విజయశాంతికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. కోకాపేట, ఖానామెట్ భూముల వేలాన్ని నిలిపివేసేందుకు హైకోర్టు నిరాకరించింది. కోకాపేటలో 44.94 ఎకరాలు, ఖానామెట్‌లో 14.92 ఎకరాల భూములను వేలం వేయడానికి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే భూముల వేలాన్ని నిలుపుదల చేయాలంటూ విజయశాంతి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. భూముల విక్రయానికి సంబంధించిన జీవో నెం 13ను కొట్టివేయాలని విజయశాంతి పిటిషన్‌లో కోరారు.

Also Read:విజయశాంతికి చుక్కెదురు.. ప్రభుత్వ భూముల వేలం నిలుపుదలకు హైకోర్టు నిరాకరణ

దీనిపై న్యాయస్థానం బుధవారం విచారణ జరిపింది. ప్రభుత్వం తరపున ఏజీ వాదనలు వినిపించారు. నిధుల సమీకరణతో పాటు భూములు కబ్జాకు గురయ్యే ప్రమాదమున్నందున ప్రభుత్వ భూములు వేలం వేస్తున్నామని ఏజీ  న్యాయస్థానానికి తెలిపారు. దీనిపై స్పందించిన కోర్టు.. భూములను ప్రభుత్వమే కాపాడుకోలేక అమ్ముకోవడం ఏంటని ప్రశ్నించింది. జిల్లాల్లో వెయ్యి ఎకరాల భూ బ్యాంక్ ఏర్పాటుపై పూర్తి స్థాయి వాదనలు వింటామని హైకోర్టు తెలిపింది. 


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios