కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కట్టుదిట్టంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే కేసులు, మరణాల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటంతో లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ తెలంగాణ కేబినెట్ శనివారం నిర్ణయం తీసుకుంది.

ఈ క్రమంలో విద్యార్ధులకు ఇబ్బందులు కలగకుండా రాష్ట్రంలోని అన్ని ప్రవేశపరీక్షలను ఉన్నత విద్యామండలి అధికారికంగా వాయిదా వేసింది. ఈ మేరకు ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది.

Also Read:సామాజిక దూరం అంటే ఇదే: ముద్దులొలికే చిన్నారులు.... పెద్దలకు నేర్పిస్తున్నారు

రాష్ట్రంలో వివిధ వృత్తి, సాంకేతిక విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించాల్సిన ఉమ్మడి ప్రవేశ పరీక్షలను వాయిదా వేసినట్లు తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి తెలిపారు.

ప్రభుత్వం లాక్‌డౌన్‌ను ఈ నెల 30వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. విద్యార్ధులు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా వచ్చే నెల 5వ తేదీ వరకు ఆయా సెట్స్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు.

Also Read:తెలంగాణలో ఏప్రిల్ 30 వరకు లాక్ డౌన్ పొడిగింపు... కేసీఆర్ కీలక నిర్ణయం

ముందస్తు షెడ్యూల్ ప్రకారం మే 2వ తేదీన ఈ సెట్ 4, 5, 7, 9, 11 తేదీల్లో ఎంసెట్ మే 13 నుంచి పీఈసెట్.. మే 20, 21 తేదీల్లో 23వ తేదీన ఎడ్‌సెట్, మే 27వ తేదీన లాసెట్, 28 నుంచి 31వ తేదీ వరకు పీజీ ఈసెట్ నిర్వహించాల్సి ఉన్నా ప్రస్తుత పరిస్ధితుల్లో వాటన్నింటిని వాయిదా వేస్తున్నట్లు వివరించారు. మళ్లీ పరీక్షల నిర్వహణపై ప్రభుత్వాన్ని సంప్రదించి తదుపరి ప్రకటన చేస్తామన్నారు.