సామాజిక దూరం అంటే ఇదే: ముద్దులొలికే చిన్నారులు.... పెద్దలకు నేర్పిస్తున్నారు
ఈ తరుణంలో తెలంగాణ మంత్రి కేటీఆర్‌ను ఓ ఫోటో ఆకట్టుకుంది. ఓ దుకాణానికి వెళ్లిన ఐదుగురు చిన్నారులు అక్కడ గీసిన రౌండ్ సర్కిల్స్‌లో నిల్చున్నారు. లోకం తెలియని చిన్న పిల్లలు కూడా సామాజిక దూరం పాటించి అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు
కరోనా మహమ్మారితో ప్రపంచం వణికిపోతోన్న సంగతి తెలిసిందే. కేవలం ముందస్తు జాగ్రత్త చర్యలే తప్పించి ఎలాంటి మందు లేని ఈ వైరస్ బారి నుంచి ఎప్పుడు బయటపడుతుందోనని ఎదురుచూస్తున్నారు.
ప్రపంచం మొత్తం లాక్‌డౌన్‌తో పాటు సామాజిక దూరం పాటిస్తూ ప్రజలు ఇళ్లలోనే ఉంటున్నారు. అత్యవసరాల కోసం రోడ్ల మీదకి వచ్చినప్పటికీ.. జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దుకాణాలు ఇతర చోట్ల మనిషికీ మనిషికి మధ్య దూరం పాటిస్తున్నారు.
Also Read:తెలంగాణలో 500 దాటిన కరోనా కేసులు, నిన్నొక్కరోజే 51 మంది డిశ్చార్జ్!
అయితే కొందరు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అవసరం ఉన్నా లేకున్నా బాధ్యతారహిత్యంగా రోడ్లమీదకి వస్తున్నారు. ఈ తరుణంలో తెలంగాణ మంత్రి కేటీఆర్‌ను ఓ ఫోటో ఆకట్టుకుంది.
ఓ దుకాణానికి వెళ్లిన ఐదుగురు చిన్నారులు అక్కడ గీసిన రౌండ్ సర్కిల్స్‌లో నిల్చున్నారు. లోకం తెలియని చిన్న పిల్లలు కూడా సామాజిక దూరం పాటించి అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు.
ఈ ఫోటో కేటీఆర్‌ను విశేషంగా ఆకట్టుకుంది. దీంతో ఆయన వెంటనే ఈ చిన్నారుల ఫోటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ‘‘ ఈ వారంలో తనకు ఎంతో నచ్చిన ఫోటో ఇదేనని... ఈ ముద్దులొలికే చిన్నారులు పెద్దలకు సామాజిక దూరంగా గురించి నేర్పిస్తున్నారు’’ అంటూ ఇంట్లో జాగ్రత్తగా ఉండండి అని మంత్రి పేర్కొన్నారు.
Also Read:తెలంగాణలో ఏప్రిల్ 30 వరకు లాక్ డౌన్ పొడిగింపు... కేసీఆర్ కీలక నిర్ణయం
ఈ ఫోటోను ఆయన షేర్ చేసిన కొద్ది క్షణాల్లోనే చాలా మంది లైక్ చేశారు. తమకు ఎదురైన అనుభవాలను షేర్ చేశారు. కాగా తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది.
ఇప్పటి వరకు రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 500 దాటింది. ఇప్పటి వరకు మొత్తంగా చూసుకుంటే తెలంగాణలో 503 కేసులు నమోదవ్వగా, 14 మంది మరణించారు. 96 మంది కోవిడ్ 19 నుంచి కోలుకున్నారు.