Asianet News TeluguAsianet News Telugu

అధికారమా... ఆత్మగౌరవమా? రేపే హుజురాబాద్ పలితం... ఓట్ల లెక్కింపుకి‌ సర్వం సిద్దం (వీడియో)

ఉత్కంఠభరితంగా సాగిన హుజురాబాద్ ఉపఎన్నిక కీలక ఘట్టానికి చేరుకుంది. ఇప్పటికే పోలింగ్ పూర్తవగా రేపు ఓట్ల లెక్కింపు జరిగి ఫలితం వెలువడనుంది. 

All Arrangements Set For Huzurabad Bypoll Votes Counting
Author
Karimnagar, First Published Nov 1, 2021, 2:21 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

కరీంనగర్: తెలంగాణ ప్రజలంతా ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్న హుజురాబాద్ ఉపఎన్నిక ఫలితం రేపు(మంగళవారం) వెలువడనుంది. ఈ ఫలితంతో తెలంగాణ రాజకీయాలు మరో మలుపుతిరిగే అకవకాశాలున్నాయన్న అంచనాల నేపథ్యంలో యావత్ రాష్ట్రం చూపంతా హుజురాబాద్ వైపే వుంది. ఇటు అధికార టీఆర్ఎస్, అటు ప్రతిపక్ష బిజెపితో తమదంటే తమదే విజయమన్న ధీమాతో వుంటే... ఎగ్జిట్ పోల్స్ మాత్రం ఫలితంపై స్పష్టమైన అంచనా వేయలేకపోయింది. దీంతో ఓట్ల లెక్కింపు పూర్తయితేన విజయం ఎవరిదన్నది తేలనుంది. హుజురాబాద్ ప్రజలు ఎవరికి పట్టం కడతారో తేలనుంది. 

మంగళవారం ఉదయం 8గంటలకు karimnagar పట్టణంలోని ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజిలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. అయతే అంతకు ముందే స్ట్రాంగ్ రూంలో భద్రపరిచిన ఈవిఎం లని అందరు అభ్యర్థులు, వారి ఎజెంట్ల సమక్షంలో బయటికి తీసుకువచ్చి టేబుళ్లపైకి చేర్చనున్నారు. ఇందుకోసం ఉదయం ఆరుగంటల నుండే అభ్యర్థులు, ఏజెంట్లను కౌంటింగ్ కేంద్రాల్లోకి అనుమతించనున్నారు. 

వీడియో

ఓట్ల లెక్కింపు ప్రక్రియ పోస్టల్ బ్యాలెట్ తో ప్రారంభంకానుంది. దాదాపు అరగటలోపే ఈ ఓట్లను లెక్కించి ఆ తర్వాత అంటే 8.30 నుండి ఈవిఎంలలో పోలయిన ఓట్లను లెక్కించనున్నారు. రెండు కేంద్రాలలో ఓట్ల లెక్కింపు జరగనుండగా... ఒక్కో కేంద్రంలో ఏడు టేబుళ్లచొప్పున మొత్తం 14 టేబుళ్లను ఓట్ల లెక్కింపు కోసం ఏర్పాటుచేసారు. ఏకకాలంలోనే అన్ని టేబుల్లలో ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇలా మొత్తం 306 పోలింగ్ కేంద్రాలలోని ఈవిఎంలలో పోలయిన ఓట్లను 22 రౌండ్లలో లెక్కించనున్నారు.

read more  huzurabad bypoll: వీవీ ప్యాట్‌ల తారుమారుపై డీకే అరుణ సంచలన వ్యాఖ్యలు

ఒక్కో రౌండ్ కు కనీసం 30నిమిషాలు పట్టే అవకాశం వుంటుంది... అంటే హుజురాబాద్ పూర్తి ఫలితం రేపు సాయంత్రానికి వెలువడే అవకాశం వుంది. ప్రతి రౌండ్ ముగిసిన తర్వాత ఎన్నికల అధికారులే అధికారికంగా వెల్లడిస్తారు. అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా వుండటం... పోలింగ్ శాతం కూడా ఎక్కువగా నమోదవడంతో గతంలో కంటే కాస్త ఆలస్యంగానే ఫలితం వెలువడనుంది. 

మొదటగా హుజురాబాద్ మండలంలోని 14 గ్రామాల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఆ తర్వాత వరుసగా వీణవంక, జమ్మికుంట, ఇల్లందకుంట,కమలాపూర్ మండలాల పోలింగ్ బూత్ ల వారిగా ఓటలను లెక్కించనున్నారు. చివరగా కమలాపూర్ మండలంలోని గ్రామాల వారిగా ఓట్లని లెక్కించనున్నారు.

read more  huzurabad bypoll: వీవీ ప్యాట్‌ల తారుమారుపై దుమారం .. వివరణ కోరిన తెలంగాణ సీఈవో

ఇక ఓట్ల లెక్కింపు జరగనున్న కాలేజీ వద్దే కాకుండా సున్నితమైన ప్రాంతాల్లో ఇప్పటికే పోలీసులు బందోబస్తు ఏర్పాటుచేసారు. లెక్కింపు కేంద్రం వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా 144 సెక్షన్ అమలు చేయనున్నారు. అన్ని రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్ధులు ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా సాగేలా సహకరించాలని ఈసీ కోరింది. 

హుజురాబాద్ ఉపఎన్నికలో బిజెపి తరపున ఈటల రాజేందర్, టీఆర్ఎస్ తరపున గెల్లు శ్రీనివాస్ యాదవ్, కాంగ్రెస్ తరపున బల్మూరి వెంకట్ పోటీచేసారు. వీరిలో ఎవరు విజేతలుగా నిలిచి హుజురాబాద్ ఎమ్మెల్యే పదవిని అధిరోహించనున్నారో మరికొద్ది గంటల్లో తేలనుంది. 


 

Follow Us:
Download App:
  • android
  • ios