huzurabad bypoll: వీవీ ప్యాట్‌ల తారుమారుపై దుమారం .. వివరణ కోరిన తెలంగాణ సీఈవో

హుజురాబాద్‌లో వీవీ ప్యాట్‌లా తారు‌మారుపై వివరణ ఇవ్వాలని కరీంనగర్ కలెక్టర్ (karimnagar collector), హుజురాబాద్ ఆర్‌వోను రాష్ట్ర  ఎన్నికల ప్రధానాధికారి (telangana election commissioner ) శశాంక్ గోయల్ (shashank goyal) ఆదేశించారు. ఉపఎన్నిక కౌంటింగ్ ఏర్పాట్లపై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ను నిర్వహించారు. రేపు అన్ని రాజకీయ పార్టీల నేతలపై సమావేశాన్ని ఏర్పాటు చేశారు. 

telangana election commissioner reacts evms missing after huzurabad by poll polling

హుజురాబాద్‌లో వీవీ ప్యాట్‌లా తారు‌మారుపై వివరణ ఇవ్వాలని కరీంనగర్ కలెక్టర్ (karimnagar collector), హుజురాబాద్ ఆర్‌వోను రాష్ట్ర  ఎన్నికల ప్రధానాధికారి (telangana election commissioner ) శశాంక్ గోయల్ (shashank goyal) ఆదేశించారు. ఉపఎన్నిక కౌంటింగ్ ఏర్పాట్లపై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ను నిర్వహించారు. రేపు అన్ని రాజకీయ పార్టీల నేతలపై సమావేశాన్ని ఏర్పాటు చేశారు. 

కాగా.. హుజురాబాద్‌లో పోలింగ్ ముగిసిన తర్వాత ప్రభుత్వం ఏర్పాటుచేసిన బస్సులో కాకుండా ఓ ప్రైవేట్ కారులో ఈవీఎంలను తరలించారంటూ తొలుత కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఇలా ఈవీఎంలను తరలిస్తున్నట్లు అనుమానిస్తున్న కారును ఈవీఎంలను భద్రపరుస్తున్న కరీంనగర్‌లోని ఎస్‌ఆర్‌ఆర్‌ కళాశాల వద్ద కాంగ్రెస్ శ్రేణులతో కలిసి అభ్యర్థి బల్మూరి వెంకట్ పట్టుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు తీవ్ర వాగ్వాదం జరిగి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. 

అయితే EVM ను తరలిస్తున్నట్లు పేర్కొంటున్న కారుతో పాటు ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత పోలీసులు balmoor venkat తో పాటు congress కార్యకర్తలకు సర్దిచెప్పి అక్కడినుండి పంపించారు. టీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని పోలింగ్ సమయంలో అక్రమంగా వ్యవహరించడమే కాదు huzurabad polling తర్వాత కూడా ప్రజాతీర్పును మార్చే కుట్ర చేస్తోందని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ప్రైవేట్ వాహనంలో టీఆర్ఎస్ అభ్యర్థి gellu srinivas yadav మనుషులు ఈవీఎంలను తరలించారని... పోలీసులు కూడా వారికి సహకరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈవీఎం మిషన్లను ప్రభుత్వ వాహనంలో కాకుండా ప్రైవేట్ వాహనంలో తరలించాల్సిన అవసరం ఏముందని కాంగ్రెస్ నాయకులు ప్రశ్నించారు. 

ALso Read:Huzurabad Bypoll: తరలింపు సమయంలో ఈవీఎంలు మాయం: ఈటల సంచలనం

ఈ నేపథ్యంలో హుజురాబాద్ రిటర్నింగ్ అధికారి రవీందర్ రెడ్డి స్పందించారు. సోషల్ మీడియా పుకార్లను నమ్మవద్దని... పనిచేయని వివి ప్యాట్ ను అఫీషియల్ వాహనం నుండి మరొక అఫీషియల్ వాహనములోకి మార్చి తరలించామన్నారు Huzurabad Returning Officer Ravinder Reddy. హుజరాబాద్ పోలింగ్ లో ఈ voter verifiable paper audit trail (VVPAT)  వాడలేమని....  పోలింగ్ ప్రారంభానికి ముందే ఈ వివి ప్యాట్ పనిచేయకపోవడంతో పక్కనపెట్టామన్నారు. పోలింగ్ ముగిసిన తర్వాత ఈ వివి ప్యాట్ ను కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కళాశాల రిసెప్షన్ సెంటర్ కు ఎదురుగా గల రోడ్డుపై ఓ అధికారిక వాహనం నుండి మరొక అధికార వాహనంలోకి మార్చి గోదాంకు తరలించామన్నారు. 

అయితే వివి ప్యాట్ ను మరో వాహనంలోకి మార్చి తరలిస్తుండగా అనుమానంతో ఎవరో వీడియో తీసినట్లున్నారు. అదే వీడియో సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని రవీందర్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజలు పుకార్లను నమ్మవద్దని హుజురాబాద్ నియోజకవర్గ  రిటర్నింగ్ అధికారి సూచించారు. పోలయిన ఓట్లతో కూడిన బాక్స్ లను మాయం చేయడం దుర్మార్గమన్నారు బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్. పోలింగ్ ముగిసిన తర్వాత పోలీస్ బందోబస్తు మధ్య తరలిస్తున్న బస్సుల్లో కూడీ ఈవిఎంలు మార్చినట్టు వార్తలు వస్తున్నాయంటూ ఆందోళన వ్యక్తం చేసారు. సాంకేతిక కారణాల సాకుతో ఈవీఎం లను మార్చడం పలు అనుమానాలకు తావిస్తోందని అన్నారు.  
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios