Asianet News TeluguAsianet News Telugu

ఒకే వేదికపై బండి సంజయ్, కల్వకుంట్ల కవిత... ముచ్చట్లు పెట్టి.. ఆసక్తి రేపి...

రాజకీయంగా ఎప్పుడూ ఉప్పుూ, నిప్పులా చిటపటలాడుతూ.. ఒకరిమీద ఒకరు విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకునే Bandi Sanjay, Kalvakuntla Kavitaలు అప్యాయంగా మాట్లాడుకోవడం అక్కడికి వచ్చినవారిని ఆశ్చర్యపరిచింది. 

Alai Balai programme : bandi Sanjay, kalvakuntla kavitha on one stage
Author
Hyderabad, First Published Oct 18, 2021, 9:05 AM IST

హైదరాబాద్ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఒకే వేదికపై కూర్చున్న దృశ్యం జలవిహార్ లో నిర్వహించిన Alai Balai కార్యక్రమంలో జరిగింది. అంతేకాదు రాజకీయాలు పక్కన పెట్టి వాళ్లిద్దరూ అప్యాయంగా పలకరించుకున్నారు. 

రాజకీయంగా ఎప్పుడూ ఉప్పుూ, నిప్పులా చిటపటలాడుతూ.. ఒకరిమీద ఒకరు విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకునే Bandi Sanjay, Kalvakuntla Kavitaలు అప్యాయంగా మాట్లాడుకోవడం అక్కడికి వచ్చినవారిని ఆశ్చర్యపరిచింది. 

ఈ వేడుకలో వారూ, వీరూ అనే బేధం లేకుండా అన్ని పార్టీల వారిని పిలిచి నిజమైన దసరా స్ఫూర్తిని తెలంగాణ ప్రజలకు Bandaru Dattatreya గుర్తు చేస్తున్నారని కవిత కొనియాడారు. ఇక ఇదే కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా పాల్గొన్నారు.  

కాగా, మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కోరారు. దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని హైద్రాబాద్ జలవిహార్ లో ఆదివారం నాడు అలయ్ బలయ్ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 16 ఏళ్లుగా దసరా తర్వాత Alai Balai కార్యక్రమాన్ని బండారు దత్తాత్రేయ నిర్వహిస్తున్నారు.

హర్యానా గవర్నర్ Bandaru dattatreya  కూతురు విజయలక్ష్మి ఈ ఏడాది  ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది అలయ్ బలయ్ కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై, హిమాచల్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి,  తెలంగాణ మంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్సీ కవిత, జనసేన చీఫ్  పవన్ కళ్యాణ్ సహా పలువురు హాజరయ్యారు.

అలయ్ బలయ్‌కి పవన్‌కి ఆహ్వానం: ఇన్విటేషన్ ఇచ్చిన దత్తన్న కూతురు

ఈ సందర్భంగా ఉప రాష్ట్రపతి Venkaiah Naidu ప్రసంగించారు. దేశంలో సాంస్కృతిక పునరుజ్జీవనం జరగాలన్నారు. విపత్కర పరిస్థితి నుండి ఇప్పుడిప్పుడే బయట పడుతున్నామని ఆయన  చెప్పారు. అలయ్ బలయ్ కార్యక్రమం ఉదాత్తమైన కార్యక్రమంగా ఆయన కొనియాడారు.

మనమంతా సోదరీ సోదరుల్లా ఒక కుటుంబంంగా ఉన్నామని చాటి చెప్పేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందన్నారు వెంకయ్యనాయుడు. మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకొనేందుకు యువత చొరవ చూపాలని ఆయన కోరారు. నేచర్, కల్చర్, ఫర్ బెటర్ ఫ్యూచర్ అనే విషయాన్ని మరవొద్దని వెంకయ్యనాయుడు ప్రజలకు సూచించారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడ ఒకే వేదికపై వచ్చి సమస్యల పరిష్కారం కోసం పనిచేయాలని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కోరారు. భిన్న సంస్కృతి, సంప్రదాయాలను ఏకతాటిపైకి తీసుకురావడమే అలయ్ బలయ్ ముఖ్య ఉద్దేశ్యమని ఆయన చెప్పారు.

ఈ వేదికపై పలువురిని సన్మానించారు. అంతకుముందు తెలంగాణ గవర్నర్ తమిళిసై ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.    పలువురు కళాకారులతో ఆడిపాడి  గవర్నర్ సందడి చేశారు. అనంతరం ఆమె మాట్లాడారు. అందరికి దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణలో దసరా సంబురాలు గొప్పగా ఉన్నాయన్నారు. బతుకమ్మ పండుగ ఉత్సవాలు చాలా సంతోషంగా జరుపుకొంటున్నామని చెప్పారు.

Follow Us:
Download App:
  • android
  • ios