ఈ నెల 17న నిర్వహించే అలయ్ బలయ్ కార్యక్రమానికి రావాలని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కూతురు బండారు విజయలక్ష్మి జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ను ఆహ్వానించారు. ప్రతి ఏటా దత్తాత్రేయ దసరా మరునాడు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

హైదరాబాద్: ‘అలయ్ బలయ్’ కార్యక్రమానికి జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ ను హర్యానా గవర్నర్ bandaru dattatreya కుమార్తె శ్రీమతి బండారు vijaya laxmi సోమవారం ఆహ్వానించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

also read:ఖైరతాబాద్ గణేషుడు: తెలంగాణ, హర్యానా గవర్నర్ల తొలి పూజలు

హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ గత 16ఏళ్లుగా అలయ్ బలయ్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ నెల 17వ తేదీన హైదరాబాద్ లో alaii balai కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.dussehra మరునాడు అలయ్ బలయ్ కార్యక్రమాన్ని దత్తాత్రేయ నిర్వహిస్తున్నాడు. ఈ కార్యక్రమానికి పలు రాజకీయ పార్టీల నేతలతో పాటు, ప్రముఖులను దత్తాత్రేయ ఆహ్వానిస్తారు.

కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో కూడ దత్తాత్రేయ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రస్తుతం హర్యానా గవర్నర్ గా దత్తాత్రేయ కొనసాగుతున్నారు. హర్యానా గవర్నర్ గా ఉన్నందున ప్రముఖులను దత్తాత్రేయ కూతురు స్వయంగా కలిసి ఆహ్వానిస్తున్నారు.

కరోనా ఉధృతి కారణంగా గత ఏడాది అలయ్ బలయ్ కార్యక్రమాన్ని దత్తాత్రేయ నిర్వహించలేదు. ఈ ఏడాది తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు తక్కువగా ఉన్నాయి. దీంతో ఈ ఏడాది అలయ్ బలయ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.