గ్రేటర్‌లో బీజేపీ గెలుపు తాత్కాలికమేనన్నారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ సాధించిన విజయంపై ఆయన శనివారం పార్టీ నేతలతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా అసదుద్దీన్ మాట్లాడుతూ.. ఎంఐఎంకు వచ్చిన ఫలితాలను సమీక్షిస్తున్నామని పేర్కొన్నారు. పొత్తుపై టీఆర్ఎస్ నుంచి ఎలాంటి ప్రతిపాదన రాలేదని ఒవైసీ తేల్చి చెప్పారు.

నేరెడ్‌మెట్ ఫలితం వచ్చిన తర్వాత మేయర్, డిప్యూటీ మేయర్‌ ఎంపిక ప్రక్రియ మొదలయ్యే అవకాశాలున్నాయని అసదుద్దీన్ అభిప్రాయపడ్డారు.

కాగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ 55, బీజేపీ 48, ఎంఐఎం 44 స్థానాలను గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఏ పార్టీకీ స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో ఇక్కడ హంగ్ పరిస్ధితులు చోటు చేసుకున్నాయి. దీంతో 44 సభ్యుల బలం వున్న మజ్లిస్ పార్టీ కింగ్ మేకర్‌గా అవతరించింది.