ఆదిలాబాద్ ఎంఐఎం శాఖను రద్దు చేస్తున్నట్లు మజ్లిస్ పార్టీ తెలిపింది. పాత శాఖ స్థానంలో త్వరలోనే కొత్త ఎంఐఎం శాఖను ఏర్పాటు చేస్తామని పేర్కొంది. శుక్రవారం ఆదిలాబాద్ ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు ఫారూఖ్ అహ్మద్ ఇద్దరిపై కాల్పులకు తెగబడిన సంగతి తెలిసిందే.

ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. దీనిని సీరియస్‌గా తీసుకున్న మజ్లిస్ అధినాయకత్వం ఆదిలాబాద్ ఎంఐఎం శాఖను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. జిల్లా కేంద్రంలోని తాటిగూడలో తుపాకీ కాల్పులు కలకలం‌ రేపాయి.

Also Read:ఆదిలాబాద్ కాల్పులు: పోలీసుల అదుపులో ఎంఐఎం నేత.. గొడవ నేపథ్యమిదే

ఎంఐఎం ఆదిలాబాద్‌ జిల్లా అధ్యక్షుడు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్‌ ఫారూఖ్‌ అహ్మద్‌ రివాల్వర్‌తో స్థానికులను బెంబేలెత్తించాడు. ఈ కాల్పుల్లో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా పడ్డారు.

ఫారూఖ్‌ రెండు రౌండ్లు కాల్పులు జరపగా ఒకరికి తల, మరొకరికి పొట్ట భాగంలో బులెట్లు దూసుకెళ్లాయి. క్షతగాత్రులను రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. పాత కక్షల నేపథ్యంలో ఈ ఘటన జరిగినట్టుగా తెలిసింది.