తనను చంపేందుకు ప్రయత్నించిన వారిని క్షమిస్తున్నానని అన్నారు ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. చావు బతుకుల మధ్య వున్న తనను బతికించిన ఎమ్మెల్యే బలాలకు జీవితాంతం రుణపడి వుంటానని ఆయన తెలిపారు.   

ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. తనను చంపేందుకు ప్రయత్నించిన వారిని క్షమిస్తున్నానని అన్నారు. తనపై దాడి జరుగుతుంటే పట్టించుకోకుండా వెళ్లినవారిని కూడా క్షమిస్తున్నానని అక్బరుద్దీన్ పేర్కొన్నారు. చావు బతుకుల మధ్య వున్న తనను బతికించిన ఎమ్మెల్యే బలాలకు జీవితాంతం రుణపడి వుంటానని ఆయన తెలిపారు. 

కాగా.. 2011 ఏప్రిల్ 30న చాంద్రాయణగుట్ట పరిధిలోని కార్వాన్‌లో జరుగుతున్న ఓ ర్యాలీలో పాల్గొనేందుకు వెళ్తున్న అక్బరుద్దీన్ ఒవైపీపై దుండగులు నాలుగు రౌండ్ల కాల్పులు జరిపారు. అక్కడితో ఆగని దుండగులు ఆపై కత్తులు, డాగర్లతో అక్బరుద్దీన్‌పైనా.. ఆయన అనుచరులపైనా విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో అక్బరుద్దీన్ తీవ్రంగా గాయపడి చావు అంచులదాకా వెళ్లొచ్చారు. అయితే అక్బరుద్దీన్ గన్‌మెన్ జరిపిన ఎదురుకాల్పుల్లో నలుగురు దుండగులు హతమయ్యారు. అక్బరుద్దీన్‌పై దాడికి పాల్పడింది ఎంబీటీ పార్టీకి చెందిన మొహమ్మద్ పహిల్వాన్‌గా పోలీసుల దర్యాప్తులో తేలింది. ఓ ఆస్తికి సంబంధించిన వివాదం కారణంగానే అక్బరుద్దీన్‌పై హత్యాయత్నం జరిగిందని టాక్.