Manipur violence: మణిపూర్ లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనపై స‌ర్వ‌త్రా ఆగ్ర‌హం వ్య‌క్త‌మ‌వుతోంది. మణిపూర్ లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన వీడియో తమను తీవ్రంగా కలచివేసిందని సుప్రీంకోర్టు పేర్కొంది. మత కలహాల ప్రాంతంలో మహిళలను ఒక సాధనంగా ఉపయోగించడం ఆమోదయోగ్యం కాదని సీజేఐ డీవై చంద్రచూడ్ అన్నారు. "ఇది రాజ్యాంగ దుర్వినియోగంలో అత్యంత ఘోరమైనది. బయటకు వచ్చిన వీడియోలతో మేము తీవ్రంగా కలత చెందామని " పేర్కొన్నారు. 

AIMIM chief Asaduddin Owaisi: మణిపూర్ లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనపై స‌ర్వ‌త్రా ఆగ్ర‌హం వ్య‌క్త‌మ‌వుతోంది. మణిపూర్ లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన వీడియో తమను తీవ్రంగా కలచివేసిందని సుప్రీంకోర్టు పేర్కొంది. మత కలహాల ప్రాంతంలో మహిళలను ఒక సాధనంగా ఉపయోగించడం ఆమోదయోగ్యం కాదని సీజేఐ డీవై చంద్రచూడ్ అన్నారు. "ఇది రాజ్యాంగ దుర్వినియోగంలో అత్యంత ఘోరమైనది. బయటకు వచ్చిన వీడియోలతో మేము తీవ్రంగా కలత చెందామని " పేర్కొన్నారు. మ‌ణిపూర్ ఘ‌ట‌న‌పై ఎంఐఎం అధినేత‌, హైద‌రాబాద్ ఎంపీ అస‌దుద్దీన్ ఒవైసీ స్పందిస్తూ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

మణిపూర్ మహిళలను నగ్నంగా ఊరేగిస్తున్న వీడియో వైరల్ అయినందుకే ప్రధాని నరేంద్ర మోడీ స్పందించాల్సి వచ్చిందని అసదుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ ను గద్దె దించాలనీ, ఈ వ్యవహారంపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) విచారణ జరిపించాలని ఆయ‌న‌ డిమాండ్ చేశారు. ఏఎన్ఐ వార్తా సంస్థతో మాట్లాడిన ఒవైసీ.. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారడంతో ప్రధాని స్పందించక తప్పలేదు. అక్కడ మారణహోమం జరుగుతోంది... సీఎంను తొలగించి, ప్రధాని సీబీఐ విచారణకు ఆదేశిస్తేనే న్యాయం జరుగుతుంద‌ని అన్నారు. అంత‌కుముందు, మ‌ణిపూర్ హింస‌పై ప్ర‌ధాని మోడీ రెండు నెల‌లుగా మౌనం వ‌హించ‌డంపై మండిప‌డ్డారు. ఇక్క‌డ జ‌రిగిన హింస‌లో 160 మంది ప్రాణాలు కోల్పోయిన నష్టాన్ని సీఎం బిరెన్ సింగ్ భర్తీ చేస్తారా? అంటూ ఎంపీ ప్రశ్నించారు.

కాగా, పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందు ప్రధాని మోడీ ఈ అమాన‌వీయ ఘ‌ట‌న‌ వీడియోపై విచారం వ్యక్తం చేస్తూ, ఇది ఏ నాగరిక సమాజానికైనా సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. మహిళల రక్షణ కోసం రాజకీయాలకు అతీతంగా ముందుకు సాగాలనీ, నిందితులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ''నా హృదయం బాధ, కోపంతో నిండిపోయింది. యావత్ దేశం సిగ్గుపడింది. ముఖ్యమంత్రులందరూ తమ రాష్ట్రాల్లో శాంతిభద్రతలను మరింత బలోపేతం చేయాలని, ముఖ్యంగా మహిళల భద్రత కోసం పటిష్ట చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. రాజస్థాన్ లోనో, చత్తీస్ గఢ్ లోనో, మణిపూర్ లోనో, దేశంలో ఏ మూలలో జరిగినా - రాజకీయాలకు అతీతంగా స్పందించాలి.. మణిపూర్ ఆడబిడ్డల విషయంలో జరిగిన ఘటనను ఎప్పటికీ క్షమించలేము'' అని ప్రధాని అన్నారు.

మోడీ వ్యాఖ్యలపై స్పందించిన తీరుపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుర్పియా శ్రీనాటే ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మణిపూర్, అక్క‌డి అమాన‌వీయ ఘ‌ట‌న‌పై స్పందించేందుకు కేవలం 36 సెకన్ల సమయం మాత్రమే ఉంది, ఈ సందర్భంగా కూడా ప్ర‌ధాని కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన ఛత్తీస్ గఢ్, రాజస్థాన్ లపై వ్యాఖ్యానించారంటూ మోడీ తీరును ఎత్తిచూపారు. మ‌ణిపూర్ ఘ‌ట‌న నేప‌థ్యంలో బీజేపీ స‌ర్కారుపై తీవ్రంగా విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.