నారాయణ కళాశాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్

విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమవుతున్న నారాయణ కార్పొరేట్ కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఏఐడిఎస్ఓ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శనివారం నగరంలోని ఎస్ఆర్ నగర్ ఉమేశ్ చంద్ర విగ్రహం నుంచి భారీ ర్యాలీ తీశారు.

నారాయణ కళాశాలలలో యాజమాన్యం వేధింపులు భరించలేక శుక్రవారం ఇంటర్ విద్యార్థిని శ్రీవర్ష ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.దీనికి కళాశాల యాజమాన్యమే బాధ్యత వహించాలని ఏఐడిఎస్ఓ రాష్ట్ర కార్యదర్శి ఆర్. గంగాధర్ ఈ సందర్భంగడా డిమాండ్ చేశారు.

విద్యార్థిని ఆత్మహత్యకు కారణమైన వారిపై సమగ్ర విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని కోరారు. ర్యాలీలో ఏఐడిఎస్ఒ జిల్లా అధ్యక్షులు జె.మల్లేశ్, జిల్లా కార్యదర్శి సత్యనారాయణ, కోశాధికారి జాని, జిల్లా నేతలు నితీశ్, వెంకటేశ్, శివ, విష్ణు తదితరులు పాల్గొన్నారు.