Asianet News TeluguAsianet News Telugu

బీఆర్ఎస్ ఏమో కానీ వీఆర్ఎస్ తప్పదు: కేసీఆర్ పై మధు యాష్కీ

కేసీఆర్ కు వీఆర్ఎస్ తప్పదని ఎఐసీసీ సెక్రటరీ ముధు యాష్కీ అభిప్రాయపడ్డారు.  కేసీఆర్ చెబుతున్న ప్రత్యామ్నాయం దండగ అని ఆయన చెప్పారు. 
 

AICC Secretary Madhu Yashki Comments On KCR Over National Party
Author
First Published Oct 4, 2022, 1:48 PM IST

హైదరాబాద్: బీఆర్ఎస్ ఏమో కానీ కేసీఆర్ కు  వీఆర్ఎస్ తప్పదని  ఎఐసీసీ సెక్రటరీ మధుయాష్కీ చెప్పారు. మంగళవారం నాడు ఎఐసీసీ సెక్రటరీ మధు యాష్కీ హైద్రాబాద్ గాంధీ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ ఏర్పాటు  చేసే జాతీయపార్టీతో తమకు ఎలాంటి నష్టం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. 

ఇప్పటికే రీజీనల్ పార్టీలు ఉన్న రాష్ట్రాల్లో మరో రీజీనల్ పార్టీకి అవకాశం లేదన్నారు. కేసీఆర్ చెబుతున్న ప్రత్యామ్నాయం దండగ అని  మధు యాష్కీ చెప్పారు. తన అవినీతిని కప్పిపుచ్చుకొనేందుకు పంజాబ్ రైతులకు కేసీఆర్ ఆర్ధిక సహయం చేశారన్నారు.స్వంత విమానం కొనడానికి కేసీఆర్ కు ఎక్కడి నుండి డబ్బులు వచ్చాయని  ఆయన ప్రశ్నించారు. రూ. 800 కోట్లు కేసీఆర్ కు ఎక్కడి నుండి వచ్చాయన్నారు.తెలంగాణలో కేసీఆర్ కు ఓటమి తప్పదని ఆయన చెప్పారు.రాజ్యాధికారం కోసమే  కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని మధు యాష్కీ మండిపడ్డారు.

also read:జాతీయపార్టీ ఏర్పాటుపై రేపు కేసీఆర్ సమావేశం: హజరు కానున్న కుమారస్వామి

దసరా రోజున జాతీయపార్టీ ఏర్పాటుపై కేసీఆర్ ప్రకటన చేయనున్నారు.  టీఆర్ఎస్ పేరును మార్చనున్నారు. ఈ మేరకు పార్టీ తీర్మానం చేయనుంది. రాష్ట్రం నలుమూలల నుండి 283 మంది ప్రతినిధులు ఈ తీర్మానంపై సంతకం చేయనున్నారు. జాతీయ పార్టీ ఏర్పాటుకు వీలుగా టీఆర్ఎస్ పేరును మార్చనున్నారు.టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మార్చే అవకాశం ఉంది. దీనిపై  రేపు జరిగే సమావేశంలో తీర్మానం చేయనున్నారు.ఈ సమావేశానికి పార్టీ ప్రజా ప్రతినిధులు, నేతలకు కేసీఆర్ ఆహ్వానం పంపారు. జాతీయ రాజకీయాల్లో ప్రవేశించడానికి దారి తీసిన పరిస్థితులపై కేసీఆర్ చర్చించనున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios