Asianet News TeluguAsianet News Telugu

జాతీయపార్టీ ఏర్పాటుపై రేపు కేసీఆర్ సమావేశం: హాజరు కానున్న కుమారస్వామి

జాతీయ పార్టీ ఏర్పాటుకు సంబంధించి టీఆర్ఎస్ రేపు నిర్వహించే సమావేశానికి కుమారస్వామి హాజరు కానున్నారు. ఈ  సమావేశానికి అఖిలేష్ యాదవ్ దూరంగా ఉండనున్నారు. 

JDS Leader Kumaraswamy To Attend Tomorrow TRS Meeting
Author
First Published Oct 4, 2022, 12:18 PM IST


హైదరాబాద్: జాతీయ పార్టీ ఏర్పాటుకు సంబంధించి టీఆర్ఎస్ దసరా రోజున నిర్వహిస్తున్న సమావేశానికి  కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి హాజరుకానున్నారు.  దసరా   రోజున జాతీయ ఏర్పాటుకు సంబంధించి  పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు కేసీఆర్.  ఈ సమావేశానికి పార్టీ ప్రజా ప్రతినిధులు, నేతలను  ఆహ్వానించారు. సుమారు 283 మంది నేతలు ఈ  సమావేశానికి వస్తారు. టీఆర్ఎస్ ను జాతీయ పార్టీ గా మార్చేందుకు అనువుగా పార్టీ పేరును మార్చే విషయమై తీర్మానం చేయనున్నారు. జాతీయ పార్టీ ఏర్పాటు చేసేందుకు దారితీసిన పరిస్థితులను కేసీఆర్ పార్టీ నేతలకు వివరించనున్నారు.  

కేంద్రంలో బీజేపీకి చెక్ పెట్టేందుకు గాను జాతీయ రాజకీయాల్లోకి రావాలని కేసీఆర్ భావిస్తున్నారు.ప్రస్తుతమున్న టీఆర్ఎస్  జాతీయ పార్టీగా మార్చాలని కేసీఆర్ ప్లాన్ చేశారు. ఈ మేరకు టీఆర్ఎస్ పేరును మార్చనున్నారు.  పార్టీ పేరు మార్పునకు సంబంధించి  రేపు పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో తీర్మానం చేయనున్నారు.  పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొనేందుకు వీలుగా నేతలంతా ఇవాళ రాత్రికే హైద్రాబాద్ కు చేరుకుంటారు. రేపు ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్ లో పార్టీ సమావేశం ప్రారంభం కానుంది.  ఈ సమావేశంలో పార్టీ పేరు మార్పుపై తీర్మానం ఆమోదించనుంది. ఈ తీర్మానం తర్వాత జాతీయ పార్టీకి సంబంధించి కేసీఆర్ ప్రకటన చేయనున్నారు. రేపు చేసే తీర్మానానికి సంబంధించిన  ప్రతులను ఈ నెల 6వ తేదీన టీఆర్ఎస్ ప్రతినిధులు ఢిల్లీలో ఈసీకి అందించనున్నారు.

also read:దసరా రోజున యధావిధిగా టీఆర్ఎస్ సర్వసభ్య సమావేశం: కేసీఆర్

రేపు జరిగే సమావేశానికి కుమారస్వామితో  సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ కు కూడా కేసీఆర్ ఆహ్వానం పలికారు. అయితే అఖిలేష్ యాదవ్ తండ్రి ములాయం సింగ్ యాదవ్ అనారోగ్యంగా ఉన్నారు. ఐసీయూలో  ములాయం సింగ్ యాదవ్ చికిత్స పొందుతున్నారు.  దీంతో ఈ సమావేశానికి అఖిలేష్ యాదవ్ దూరంగా ఉండనున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios