Asianet News TeluguAsianet News Telugu

కోమటిరెడ్డికి ఎఐసీసీ క్రమశిక్షణ సంఘం షోకాజ్ నోటీసు: 10 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం

మునుగోడులో  కాంగ్రెస్  పార్టీ  గెలవదని వ్యాఖ్యలు  చేసిన  భువనగిరి  ఎంపీ  కోమటిరెడ్డి వెంకట్  రెడ్డిపై  పార్టీ నోటీసులు పంపింది. 10  రోజుల్లో  వివరణ ఇవ్వాలని  ఆదేశించింది.

AICC Disciplinary Committee Issues  Notice To Bhuvanagiri MP  Komatireddy Venkat Reddy
Author
First Published Oct 23, 2022, 1:58 PM IST

హైదరాబాద్: భువనగిరి  ఎంపీ  కోమటిరెడ్డి వెంకట్  రెడ్డికి  కాంగ్రెస్  పార్టీ అధిష్టానం  ఆదివారంనాడు నోటీసులు పంపింది. మునుగోడులో కాంగ్రెస్  పార్టీ  విజయం సాధించదని కోమటిరెడ్డి వెంకట్  రెడ్డి  చేసిన  వ్యాఖ్యలపై   వివరణ ఇవ్వాలని కోమటిరెడ్డి  వెంకట్  రెడ్డిని  కాంగ్రెస్  పార్టీ  ఆదేశించింది.

అస్ట్రేలియా పర్యటనలో  ఉన్న  భువనగిరి ఎంపీ  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మునుగోడులో  కాంగ్రెస్  పార్టీ విజయం  సాధించిందని వ్యాఖ్యలు  చేశారు.  ఈ వ్యాఖ్యలపై  కాంగ్రెస్  పార్టీ  నాయకత్వం  సీరియస్  గా  తీసుకుంది.  ఈ వ్యాఖ్యలపై  పది రోజుల్లో  వివరణ  ఇవ్వాలని  కాంగ్రెస్ పార్టీ  క్రమశిక్షణ  సంఘం   షోకాజ్  నోటీసులు  జారీ  చేసింది. అంతకు ముందే  మునుగోడు నియోజకవర్గానికి  చెందిన  కాంగ్రెస్ కార్యకర్తతో   కోమటిరెడ్డి వెంకట్  రెడ్డి  మాట్లాడినట్టుగా  ఉన్న ఆడియో  వెలుగు  చూసింది.  పార్టీని చూడవద్దని  ఈ ఎన్నికల్లో  బీజేపీ  అభ్యర్ధిగా  బరిలో ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్  రెడ్డికి ఓటేయాలని కోరారు.   అస్ట్రేలియా టూర్ లో  ఉన్న కోమటిరెడ్డి  వెంకట్  రెడ్డి తనను  కలిసిన అభిమానులతో  చేసిన వ్యాఖ్యలు  కలకలం  రేపాయి. మునుగోడులో  కాంగ్రెస్  పార్టీ  విజయం సాధించదని  ఆయన  తేల్చి చెప్పారు.

ఈ విషయమై  కాంగ్రెస్ పార్టీ  కార్యదర్శులు  విచారణ నిర్వహించి  పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ మాణికం ఠాగూర్  కు   నివేదిక ఇచ్చారు. ఈ నివేదిక  ఆధారంగా  కాంగ్రెస్  పార్టీ రాష్ట్ర ఇంచార్జీ  మాణికం ఠాగూర్  ఎఐసీసీ  క్రమ:శిక్షణ సంఘానికి సమాచారం  ఇచ్చారు. 

AICC Disciplinary Committee Issues  Notice To Bhuvanagiri MP  Komatireddy Venkat Reddy

దీంతో  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి   ఎఐసీసీ  క్రమశిక్షణ సంఘం షోకాజ్  నోటీసులు పంపింది.  ఈ  నోటీసులపై కాంగ్రెస్  ఎంపీ  కోమటిరెడ్డి వెంకట్  రెడ్డి  ఎలా  స్పందిస్తారో  చూడాలి.మునుగోడులో  ఎన్నికల ప్రచారానికి  కూడా  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దూరంగా ఉన్నారు.  ఈ ప్రచారంలో  పాల్గొనాలని  పాల్వాయి  స్రవంతి  కూడా  కోరారు. కానీ  కాంగ్రెస్  ఎన్నికల ప్రచారానికి వెళ్లలేదు.

also read:చిన్నకొండూరులో ఉద్రిక్తత:కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని అడ్డుకున్న టీఆర్ఎస్, కాంగ్రెస్

ఈ  ఏడాది ఆగస్టు 5న  చండూరులో  నిర్వహించిన కాంగ్రెస్  సభలో  తనను  అద్దంకి  దయాకర్  దూషించడంతో   పాటు టీపీసీసీ  చీఫ్  రేవంత్  రెడ్డి  చేసిన హోంగార్డు,ఎస్పీ వ్యాఖ్యలతో  ప్రచారానికి వెళ్లడం లేదని  కోమటిరెడ్డి వెంకట్  రెడ్డి తేల్చిచెప్పారు. మునుగోడు ప్రచారానికి  వెళ్లకుండా   తన  అనుచరులకు  ఫోన్లు చేస్తూ బీజేపీకి  ఓటేయాలని  కోమటిరెడ్డి  వెంకట్  రెడ్డి  ప్రచారం  చేయడాన్ని పార్టీ నాయకత్వం సీరియస్ గా  తీసుకుంది.   

మునుగోడులో  చావో  రేవో  తేల్చుకోవాలని కాంగ్రెస్  పార్టీ  నాయకత్వం  పనిచేస్తున్న సమయంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  వ్యవహరిస్తున్న తీరు పార్టీక నష్టం  కల్గించేలా ఉందనే  అభిప్రాయంతో  పార్టీ  నాయకత్వం  ఉంది. ఇవాళ రాహుల్ గాంధీ  పాదయాత్రకు స్వాగతం  పలికేందుకు  వచ్చిన మాణికం  ఠాగూర్ కూడా  కోమటిరెడ్డి  వెంకట్  రెడ్డి  వ్యాఖ్యలపై స్పందించారు.ఎఐసీసీ నాయకత్వం ఈ విషయమై  పరిశీలిస్తుందని  చెప్పారు. 

Also read:నేను ప్రచారం చేసినా ... మునుగోడులో కాంగ్రెస్ ఓటమి ఖాయం : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలనం

ఈ వ్యాఖ్యలు చేసిన  కొద్ది గంటల్లోనే  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి  పార్టీ షోకాజ్  నోటీసులు  జారీ  చేసింది.మునుగోడు అసెంబ్లీ  స్థానానికి  వచ్చే నెల 3వ  తేదీన ఉప ఎన్నిక జరగనుంది. ఈ  స్థానానికి  కాంగ్రెస్ అభ్యర్ధిగా పాల్వాయి స్రవంతి., బీజేపీ అభ్యర్ధిగా కోమటిరెడ్డి  రాజగోపాల్  రెడ్డి,  టీఆర్ఎస్  అభ్యర్ధిగా  కూసుకుంట్ల  ప్రభాకర్  రెడ్డి  బరిలో నిలిచారు.

Follow Us:
Download App:
  • android
  • ios