తెలంగాణ పోలీస్ పోస్టులకు వయో పరిమితి పెంచాల్సిందే

Age limit for police recruitment should be enhanced
Highlights

నిరుద్యోగ జెఎసి డిమాండ్

తెలంగాణ కానిస్టేబుల్/ఎస్సై ఉద్యోగాల్లో వయోపరిమితిని 6 ఏళ్లకు పెంచాలని తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ జెఏసి ఛైర్మన్ కోటూరి మానవతా రాయ్ ఆధ్వర్యంలో సోమవారం ఖమ్మం పెవీలియన్ గ్రౌండ్ నుండి కలెక్టరేట్ వరుకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిరుద్యోగ అభ్యర్థులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ధర్నాచౌక్ లో నిరుద్యోగ అభ్యర్థులను ఉద్దేశించి మానవతా రాయ్ మాట్లాడుతూ పక్క రాష్ట్ర మైన మహారాష్ట్రలో 31 సంవత్సరాలు, బీహార్ లో 35 సంవత్సరాలు వయోపరిమితి ఉన్నప్పుడు మన రాష్ట్రంలో తక్కవగా ఉంచి ప్రభుత్వం నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం చేస్తుందని ఆయన విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం వయోపరిమితి 6ఏళ్ళు పెంచకుంటే పెద్దఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

ధర్నా అనంతరం కలెక్టర్ లోకేష్ కుమార్ ని కల్సి వినతిపత్రం సమర్పించారు.ఈ కార్యక్రమం లో నిరుద్యోగ జెఏసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మా పరాశర్ గౌడ్,బుర్రా సైదులు యాదవ్, తమ్మినేని అనీల్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

loader