పవన్ ను వదిలేసి జీవతా రాజశేఖర్ ను తగులుకున్న శ్రీ రెడ్డి

First Published 18, Apr 2018, 5:56 PM IST
after pawan srireddys new target is jeevita Rajasekhar
Highlights

చేతులు కాలిన తర్వాత రూట్ మార్చిందా ?

తెలుగు సినీ పరిశ్రమలో పూటకో మాట మాట్లాడుతూ శ్రీ రెడ్డి వివాదాల్లో చిక్కుకుంటున్నది. నిన్నటి వరకు పవన్ కళ్యాణ్ మీద తీవ్రమైన విమర్శలు గుప్పించింది. పవన్ కళ్యాణ్ ను హీనమైన భాషలో తిడుతూ వేడి పెంచింది. అంతేకాదు పవన్ తల్లిని కూడా హీనమైన భాషలో తిట్టి విమర్శలపాలైంది. దీంతో అన్న వర్గాల నుంచి శ్రీరెడ్డి తీరు పట్ల వ్యతిరేకత వ్యక్తమైంది. అసలు పవన్ కళ్యణ్ ను ఎందుకు అర్థం పర్థం లేకుండా ఎందుకు టార్గెట్ చేశారని పవన్ ఫ్యాన్స్ ప్రశ్నల వర్షం కురిపించారు. ఎదురుదాడికి దిగారు. అంతేకాదు పవన్ తల్లిని అనాల్సినంత అవసరం ఏమొచ్చిందని నిలదీశారు.

దీంతో అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తం కావడంతో శ్రీరెడ్డి దిగొచ్చింది. ఇన్నిరోజులు రకరకాల ప్రయత్నాలు చేసినా.. తుదకు బట్టలిప్పి ప్రదర్శనలు చేసినా చాలా కాలం దాకా ఎవరి మద్దతు రాలేదు. అయితే ఆమె ఆందోళనలో కొద్దోగొప్పో న్యాయం ఉందన్న ఉద్దేశంతో తెలంగాణ యూత్ ఫోర్స్ లాంటి సంస్థలు ఆమెకు సపోర్ట్ చేశాయి. తర్వాత ఉస్మానియాలో కొందరు విద్యార్థి నాయకులు సపోర్టు చేశారు. అయితే అంతలోనే పవన్ కళ్యాణ్ తల్లి గురించి హీనమైన భాషలో శ్రీరెడ్డి మాట్లాడడంతో వచ్చిన మద్దతు, సానుభూతి అంతా గంగలో కలిసిపోయింది. దీంతో శ్రీరెడ్డి దిగొచ్చింది. పవన్ కళ్యాణ్ కు, ఆమె తల్లికి క్షమాపణలు చెప్పింది. బుధవారం ఈ మేరకు తన వాల్ మీద క్షమాపణల పోస్టు పెట్టింది శ్రీరెడ్డి.

అయితే బుధవారం ఉదయం నుంచీ హైడ్రామా నడిపింది శ్రీరెడ్డి. ఉదయమే తాను ఓడిపోయానంటూ.. ఇక సెలవు అన్న ధోరణిలో ఫేస్ బుక్, ట్విట్టర్ లలో పోస్టులు పెట్టింది. తాను ఒంటరిదానినై పోయానని కామెంట్ పెట్టింది. అలా పోస్టులు పెట్టి తన ఫోన్ స్విచ్చాఫ్ చేసేసి ఎవరికీ అందుబాటులో లేకుండాపోయింది. దీంతో సోషల్ మీడియాలో పెద్ద చర్చ సాగింది. సోషల్ మీడియాలోనే కాదు.. మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ శ్రీరెడ్డి ఏమైనా చేసుకుంటుందా అన్నట్లు ప్రచారం నడిచింది. అయితే ఐదారు గంటల తర్వాత మళ్లీ ఆన్ లైన్ లోకి వచ్చింది శ్రీ రెడ్డి. అలా వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ కు క్షమాపణలు చెబుతూ పోస్టు పెట్టింది. పవన్ తల్లికి క్షమాపణలు చెప్పింది. అంతేకాదు పవన్ చెప్పినట్లే నడుచుకుంటానంటూ కామెంట్ చేసింది. తాను పోలీసు స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసి న్యాయపోరాటం చేస్తానని ప్రకటించింది.

ఇక అంతటితో ఆగకుండా బాణాన్ని జీవితా రాజశేఖర్ వైపు తిప్పింది. వరుస పోస్టులతో జీవిత రాజశేఖర్ ల మీద విరుచుకుపడింది. జీవితను వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించింది. తన వద్ద అన్ని ఆధారాలున్నయని, కోర్టులో కొట్లాడేందుకు సిద్ధంగా ఉండాలన్న హెచ్చరికలతో పోస్టుల వరద పారిస్తోంది.

మొత్తానికి అడుసు తొక్కనేల కాళ్లు కడగనేల అన్నట్లు సంబంధం లేకపోయినా పవన్ కళ్యాణ్ మీద నోటికొచ్చినట్లు మాట్లాడిన శ్రీరెడ్డి ఎట్టకేలకు తన తప్పు తెలుసుకుని క్షమాపణలు చెప్పిందని పవన్ ఫ్యాన్స్ అంటున్నారు. అయితే ఇప్పుడు మరి జీవిత రాజశేఖర్ కుటుంబాన్ని తగులుకోవడం కొత్త ట్విస్ట్ గా చెబుతున్నారు.

loader