శ్రీశైలం: కరోనాను  జయించాడు... కానీ మృత్యువును మాత్రం జయించలేకపోయాడు ఏఈ సుందర్ నాయక్. కరోనా నుండి కోలుకొని విధుల్లో చేరిన కొన్ని రోజులకే అగ్ని ప్రమాదంలో ఏఈ సుందర్ నాయక్ మరణించాడు. ఈ విషయం తెలిసిన కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

also read:ఐదు నిమిషాల్లో చనిపోతున్నా.. రావొద్దు: శ్రీశైలం అగ్ని ప్రమాదంలో ఏఈ మోహన్

సూర్యాపేట  జిల్లాలోని చివ్వెంల మండలంలోని జగన్ తండా సుందర్ నాయక్  స్వగ్రామం. శ్రీశైలం పవర్ ప్లాంట్ లో సుందర్ నాయక్ ఏఈగా పనిచేస్తున్నాడు. ఆయనకు 20 రోజుల క్రితం కరోనా సోకింది. కరోనా సోకడంతో సెలవు పెట్టాడు. కరోనా నుండి ఆయన పూర్తిగా కోలుకొన్నారు. కరోనా నుండి జయించిన సుందర్ నాయక్ తిరిగి విధుల్లో చేరాడు.

గురువారం నాడు   శ్రీశైలం పవర్ ప్లాంట్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో మరణించారు. సుందర్ నాయక్ ఇతర ఉద్యోగులను అలర్ట్ చేసేందుకు సైరన్ మోగించాడు. సైరన్ మోగిస్తూ ప్లాంట్ నుండి  బయట పడేందుకు సుందర్ నాయక్ ప్రయత్నించారు. సుందర్ నాయక్ డెడ్ బాడీ మృతదేహం మెట్లపై పడి ఉంది. 

సుందర్ నాయక్ ప్రమాదం నుండి బయట పడేందుకు తీవ్రంగా ప్రయత్నించి మంటలకు తట్టుకోలేక మరణించినట్టుగా అధికారులు అభిప్రాయపడుతున్నారు.